భారత్ నీటి దెబ్బ...పాక్ నోట అబ్బా !

ఆ నీరే వారికి సర్వాధారం గా ఉంటుంది గత తొమ్మిది నెలలుగ ఈ నీరు లేకపోవడంతో తర్బెలా డ్యామ్ అలాగే, మంగళ డ్యామ్‌లలో నీటి నిల్వ్లల ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి.;

Update: 2026-01-21 04:00 GMT

పాకిస్తాన్ కి భారత్ నుంచి ఏ ప్రభుత్వం చేయని విధంగా నీటి దెబ్బ తీసి చుక్కలు చూపించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాక్ ఇపుడు అబ్బా అంటోంది. ఒకటా రెండా ఏకంగా తొమ్మిది నెలలు కావస్తోంది. పాక్ కి నీటి గండం అంతకంతకు పెను సుడి గుండమైపోతోంది. పాక్ బతుకు అంతా సింధూ నదీ జలాల మీదనే ఆధారపడి ఉన్నాయి. అయినా ఒక వైపు నీటిని తీసుకుంటూ మరో వైపు నిప్పులు కురిపిస్తూ ఏడున్నర దశాబ్దాల పాటు భారత్ తో చెలగాటమే ఆడింది. పర్యవసానమే మోడీ ప్రభుత్వం సింధూ నదీ జలాలను నిలిపేసి పాక్ నోటికి బిరడా బిగించేసింది.

పదేళ్ళ క్రితమే :

నిజానికి పాక్ కి నీటి కష్టాలు ఏంటో తెలియచేయాలని పదేళ్ళ క్రితం అంటే 2016లోనే భారత్ ఆలోచన చేసింది. కానీ పాక్ బుద్ధి మారుతుందేమో అని వేచి చూసింది. కానీ చివరికి పహల్గాం ఉగ్ర దాడి వెనక తమ కుట్ర కోణాన్ని చూపిస్తూ మరింతగా రెచ్చిపోతున్న పాక్ కి ఇక తప్పదని మోడీ ప్రభుత్వం చేయాల్సినదంతా చేసింది నీరూ రక్తం కలసి పారవని స్పష్టంగా మోడీ చెప్పేశారు. దాంతో పాక్ నోట్లో పచ్చి వెలక్కాయ పడిపోయింది.

దుర్బిక్షంలో పాక్ :

నీరు ఉంటేనే సంపద, నీరు ఉంటేనే వ్యవసయాం, పాక్ లో తొంబై శాతం వ్యవసాయం అంతా సింధూ నదీ జలాల నుంచే సాగుతోంది. అలాగే దాహార్తికి అవే నీరు అందుతోంది. అలాంటిది సింధూ నదీ జలాలు పారకపోయేసరికి పాక్ దిక్కుతోచనిది అవుతోంది. దేశం దుర్షిక్షం వైపుగా సాగుతోంది అని ఆందోళన పడుతోంది. తమను ఆదుకోవాలని భారత్ తో చెప్పించి తిరిగి సింధూ నదీ జలాల ఒప్పందం జరిగేలా చూడాలని వేడుకుంటోంది. అంతే కాదు భారత్ కక్షతో ఈ విధంగా చేస్తోంది అని చెబుతూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది.

పాక్ దేశమే దాసోహం :

సింధూ నదీఎ జలాలకు పాక్ దేశం మొత్తం దాసోహం అన్నట్లుగా అక్కడ పరిస్థితి ఉంది. ఆ నీరే వారికి సర్వాధారం గా ఉంటుంది గత తొమ్మిది నెలలుగ ఈ నీరు లేకపోవడంతో తర్బెలా డ్యామ్ అలాగే, మంగళ డ్యామ్‌లలో నీటి నిల్వ్లల ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వచ్చేది మండు వేసవి కాలం. ఇప్పటికే డ్యాములలో నీటి మట్టాల స్థాయి పడిపోయి డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలతో పాక్ బెంబేలెత్తుతోంది. ఇక తమ పని సరి అని అనుకుంటోంది భారత్ నుంచి సింధుని విడమని మొక్కని మొక్కు లేదని చెబుతున్నారు.

ఎందరికి చెప్పినా :

ఇక భారత్ మీద ఫిర్యాదులు పితూరీలు, ఆరోపణలు ఏడుపులు అక్కసు అంతా అంతర్జాతీయ వేదికల మీద సంస్థల వద్ద పాక్ చెప్పుకుని తెగ ఆయాసపడిపోతోంది. ఒకటేమిది ఐక్యరాజ్యసమితితో మొదలెట్టి ఆ మీదట భద్రతా మండలి దాకా అటు నుంచి షాంఘై సహకార సంస్థ వద్ద, ఇంకా ముందుకెళ్ళి ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్‌ దేశం మీద పడి ఏడుస్తూ పాక్ నంగనాచిలా ఫిర్యాదులు చేస్తోంది. తమకేమీ తెలియదని తాను సుద్ధ పూసలమని అకారణంగా సింధూ నదీ ఒప్పందాన్ని భారత్ కాదని పక్కకు పోయిందని దాయాది దేశం వగలు పోతోంది.

పాక్ ఎప్పటికి తెలుసుకుంటుంది :

అయితే తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాను అన్నది మాత్రం చెప్పకుండా మరుగున పెడుతోంది. అయితే భారత్ మాత్రం ఒక్కటే చెబుతోంది. పాక్ గడ్డ మీద ఉన్న ఆఖరి ఉగ్ర భూతాన్ని కూడా లేకుండా చేయమని, ఆ షరతుకు అంగీకరించిన నాడు సింధూ నదీ జలాలు తిరిగి పారుతాయని అంటోంది. మరి భారత్ మాట పెడ చెవిన పెట్టి ఉగ్ర వాదులలతో ఉయ్యాలలూగుతూ అమాయకంగా తమకు నీరు ఇవ్వడం లేదు భారత్ అని ప్రపంచం ముందు ఏంత ఏడ్చినా లాభం లేదని పాక్ ఎప్పటికి తెలుసుకుంటుంది అన్నదే పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News