కేంద్రం సంచలనం.. ఆవుపేడతో చిప్

Update: 2020-10-13 10:10 GMT
ఆవులు అన్నా.. గోమూత్రం, గోపేడ అన్న హిందువులకు పరమ పవిత్రం. చాలా రోగాలకు ఆవు మూత్రం, పేడ మందుగా వాడుతారు. ఇప్పటికే ఎన్నో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు.

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్రీయ కామథేను ఆయోగ్  అనే సంస్థ ఆవుపేడతో చిప్ తయారు చేసింది. అంతేకాదు ఈ చిప్ తో రేడియేషన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కూడా చెబుతోంది. ఇది శాస్త్రీయంగా నిరూపణ అయ్యిందని సంస్థ చీఫ్ కటారియా చిప్ విడుదల సందర్భంగా ప్రకటించారు.

దేశవ్యాప్తంగా గోవధను అరికట్టడం.. గోవుల సంరక్షణ చేపట్టేందుకే వీటి ఉత్పత్తులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రోత్సహించేందుకు కేంద్ర పశుసంవర్ధక శాఖ ‘రాష్ట్రీయ కామథేను ఆయోగ్’ సంస్థను ఏర్పాటు చేసింది.

ఈ సంస్థ గోవులకు సంబంధించిన ప్రతి ఉత్పత్తిని శాస్త్రీయంగా పరిక్షీంచి వాటిని జనంలోకి విస్తృతంగా వ్యాప్తి చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్ కు వ్యతిరేకంగా పనిచేసే ఆవుపేడతో తయారు చేసిన చిప్ ను సంస్థ విడుదల చేసింది. దీన్ని మొబైల్ ఫోన్లలో ఉపయోగించడం ద్వారా రేడియేషన్ నుంచి కాపాడుకోవచ్చని చెబుతోంది.

కాగా గౌసత్వ కవచ్ పేరుతో రూపొందిన ఈ చిప్ ను గుజరాత్ కు చెందిన ఓ గోశాల తయారు చేసినట్లు కేంద్రం చెబుతోంది. రేడియేషన్ కు వ్యతిరేకంగా పనిచేసే ఆవుపేడతో తయారు చేసిన చిప్ బాగా పనిచేస్తుందని కేంద్రం ప్రకటన దేశంలో సంచలనంగా మారింది.
Tags:    

Similar News