6 నెలల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ శక్తిని కోల్పోతారట..

Update: 2022-01-20 06:30 GMT
తాజాగా అధ్యయనం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) చేత హైదరాబాద్ లో కోవిడ్ వ్యాక్సిన్ లు పొందిన 1636 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై ఒక సంచలనాత్మక దీర్ఘకాలిక అధ్యయనం, వయసుతోపాటు కోవిడ్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి స్థాయిలు కూడా క్షీణిస్తాయని సూచించింది.

ఏఐజీ అధ్యయనంలో  ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. ‘ప్రపంచ అధ్యయనాలతో సమానంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 30శాతం మంది వ్యక్తులు 6 నెలల తర్వాత రక్షిత రోగ నిరోధక శక్తి స్థాయిల కంటే యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నారని మేము కనుగొన్నాం.

ఈ వ్యక్తులు అధిక రక్తపోటు, మధుమేహ: వంటి కోమోర్బిడీటీలతో ఎక్కువగా 40 ఏళ్లు పైబడి ఉన్నారు. అని అధ్యయనంలో భాగమైన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డి. నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. మధుమేహం, రక్తపోటు ఉన్న 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీ పురుషఉలలో కరోనా సంక్రమణకు ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు 6 నెలల తర్వాత బూస్టర్ డోసులు వేసుకోవాలి.. ఏఐజీ, ఆసియాన్ సహకారంతో ఈ విషయం బయటపడింది.

ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యగా డోస్ లేదా బూస్టర్ డోస్ కోసం 9 నెలల గ్యాప్ జనాభాలో 70 శాతం మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారు 6 నెలలకు మించి తగినంత యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉంటారు. అయినప్పటికీ మన దేశంలోని స్కేల్ ను పరిగణలోకి తీసుకుంటే 30శాతం జనాభా, ముఖ్యంగా కోమోర్బిడ్ పరిస్థితులు ఉన్నారు. పూర్తి టీకాలు వేసిన 6 నెలల తర్వాత ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న వారు కూడా ముందు జాగ్రత్త మోతాదు కోసం పరిగణించాలని అధ్యయనంలో పాల్గొన్న వైద్యుడు వెల్లడించారు.

ప్రస్తుతం వ్యాక్సిన్ ల ప్రభావాన్ని ధీర్ఘకాలికంగా అర్థం చేసుకోవడం.. నిర్ధిష్ట జనాభా సమూహాలకు త్వరగా బూస్టర్ అవసరమా అని చూడడం ఈ అధ్యయనం లక్ష్యంగా పెట్టుకుంది అని డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి చెప్పారు.
Tags:    

Similar News