గ్రేటర్ ఓట్ల లెక్కింపునకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ ..కౌంటింగ్‌ కేంద్రాల్లో కండిషన్స్ ఇవే!

Update: 2020-12-03 17:22 GMT
గ్రేటర్ లో విజయం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. దీనితో అన్ని పార్టీ నేతల్లో కూడా టెంక్షన్ తారా స్థాయికి చేరుకుంది. దుబ్బాక లో సత్తా చాటిన బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా , లేక లోకల్ పార్టీ కారు మేయర్ పదవిని మళ్లీ అందుకుంటుందా , పాతబస్తీ మళ్లీ మజ్లిస్‌ దేనా , అసలు హైదరాబాద్‌ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు. వీటన్నింటికి గంటల్లో సమాధానం రాబోతోంది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్ ‌డౌన్‌ మొదలైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దీనితో ఇప్పటికే అధికారులు అంతా సిద్ధం చేశారు.

మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌ లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. మూడు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మెహిదీపట్నంలో 11 వేల 818 ఓట్లు మాత్రమే పోలయ్యాయి‌. ఇక్కడ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు ఫలితం తేలిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో గ్రేటర్ డివిజన్లున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాస్‌ ఉంటేనే లోపలకు ఎంట్రీ ఉంటుందని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లను కౌంటింగ్ సెంటర్లకు అనుమతి లేదని వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
Tags:    

Similar News