అంబటి వ్యాఖ్యల వెనుక అసలు రీజన్ ఇదేనా ..!
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నడిరోడ్డుపై మీడియా ముందే.. సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.;
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నడిరోడ్డుపై మీడియా ముందే.. సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం జీర్ణించుకోలేని విధంగా ఆయన నోటికి పని చెప్పా రు. ఇదే వైసీపీ అధికారంలో ఉండి.. అదే అంబటి టీడీపీలో ఉండి ఉంటే.. నడిరోడ్డుపైనే ఆయనను పెడ రెక్కలు విరిచి అరెస్టు చేసి ఉండేందన్న చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ నాయకుడు.. కొమ్మారెడ్డి పట్టాభి.. జగన్‌పై చేసిన వ్యాఖ్యతో ఆయనను అర్థరాత్రి రెక్కలు విరిచి మరీ అరెస్టు చేశారు.
ఇప్పుడు గత ఉదంతం కూడా చర్చకు వస్తోంది. మొత్తంగా అంబటిని ఎవరూ సమర్థించడం లేదు. ఒక్క జగన్ తప్ప. వైసీపీలోనే చాలా మంది నాయకులు మౌనంగా ఉన్నారు. అంబటి చేసింది తప్పని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ ది రికార్డుగా కొందరు నేతలు.. మీడియా మిత్రులతో మాట్టాడుతూ..``అంబటికి నోటి దూల ఎక్కువ. గతంలో గంటా అరగంట... అంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడ కూడా ఆయన మారడం లేదు.`` అని చెబుతున్నారు. మరికొందరు అంబటిని తిడుతున్నారు.
ఇదిలావుంటే.. అసలు అంబటి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు రీజనేంటి? అనేది ప్రధాన అంశం. వైసీపీ నాయకులు పైకి చెబుతున్నట్టుగా.. టీడీపీ శ్రేణులు ఆయన కారును అడ్డుకున్నారని.. అందుకే అంబటి ఇలా రెచ్చిపోయారని అంటున్నారు. కానీ, వాస్తవం అది కాదని వైసీపీ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అంబటికి ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయిందని.. ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పదవి నుంచి తప్పించారని.. అందుకే.. గత కొంత కాలంగా పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు.
దీంతోపాటు.. అంబటి పై ఇటీవల కూడా పలు కేసులు నమోదయ్యాయని.. పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీపై ఆయన అక్కసుతో ఉన్నారని.. ఇలాంటి అనేక కారణాలతోనే.. అంబటి తన కోపాన్ని ఈ రూపంలో వ్యక్తం చేశారని.. ఫలితంగా పార్టీని మరింత భ్రష్టు పట్టించారని చెబుతున్నారు. ఒక్క అంబటి మాత్రమే కాకుండా.. ఇతర నాయకులు కూడా ఇలానే ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నది వారు చెబుతున్నమాట. కానీ.. కొందరు సంయమనం పాటిస్తుండగా.. మరికొందరు.. రోడ్డున పడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు కోపం అంతా వైసీపీ అధినేతపైనేనని అంటున్నారు.