కరోనా దెబ్బ.. అప్పులు ఊబిలో ఇండియా.. !
కరోనా దెబ్బ అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్ప కూల్చింది. అన్ని దేశాల లాగే మన దేశం కూడా ఆర్థికంగా కుంగిపోయింది. మిగతా దేశాల కంటే భారత్ మాత్రం చాలా లాస్ అయ్యింది. అప్పుల ఊబిలో కురుకుపోయింది. ఈ ఏడాది భారత ప్రభుత్వ రుణ భారం 17 శాతం పెరిగి జీడీపీలో 90 శాతానికి చేరవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 1991 నుంచి మనదేశ రుణభారం జీడీపీ లో 70 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. కొవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైంది. ఆర్థిక వ్యవస్థ ను గాడి లో పెట్టేందుకు ప్రభుత్వం వ్యయాలను పెంచింది. దీంతోపాటు ఆదాయాలు క్షీణించడతో పన్ను రాబడి కూడా గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యం లో ఈ ఏడాది రుణభారం 17 శాతం పెరిగే అవకాశం ఉన్నదని అది జీడీపీ లో 90 శాతానికి చేరే అవకాశం ఉన్నదని ఐఎంఎఫ్ ఆర్థిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ విటార్ గాస్పర్ పేర్కొన్నారు.
2021 వరకు ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగినప్పటికీ.. 2025 నాటికి క్రమంగా తగ్గే అవకాశం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాకు స్పందనగా ప్రభుత్వ వ్య యాలను పెంచడం భారతదేశం ఒక్క దానికే పరిమితం కాదని ఆయన అన్నారు. 1991లో ఆర్థిక సరళీకరణ జరిగిన నాటి నుంచి ప్రపంచ వృద్ధిలో భారత్ కీలక భాగస్వామిగా ఉన్నదని ఆయన చెప్పారు. 1991 నుంచి 2019 మధ్య కాలంలో వాస్తవ జీడీపీ వృద్ధి 6.5 శాతం ఉండడం ప్రోత్సాహకరమైన అంశమని, దీని కారణంగా లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారని గాస్పర్ తెలిపారు. మనదేశంలో దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న వారి (రోజుకి 1.9 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం) సంఖ్య 1993లో 45 శాతం ఉన్నది. 2015 నాటికి 13 శాతానికి తగ్గిందని చెప్పారు.