• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫోకస్: ఆటోమొబైల్ పరిశ్రమ...

ఫోకస్: ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలనా?

By - Tupaki Desk
Update: 2020-04-16 02:45 GMT
ఆటోమొబైల్ పరిశ్రమ. ఇది ఎంత ఎదిగితే ఆ దేశపు వృద్ధి రేటు అంత వేగంగా సాగుతున్నట్టు లెక్క. అభివృద్ధికి సూచికగా ఆటోమొబైల్ పరిశ్రమను ఆర్థికవేత్తలు చెబుతుంటారు. భారత దేశంలో లాక్ డౌన్ వల్ల ఇప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. లాక్ డౌన్ తో అందరి ఉద్యోగ - ఉపాధి పోవడంతో ఇక ఆటోమొబైల్ రంగం రెండేళ్ల వరకూ కోలుకునే పరిస్థితి ఉండదని నిపుణులు ఘంఠాపథంగా చెబుతున్నారు.

*అమెరికా అందుకే లాక్ డౌన్ విధించలేదు..

ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్రం అమెరికా. అక్కడ తయారీ - డిజైన్ పరిశ్రమ ఉంది. వాహన - ఇతర ఆటోమొబైల్ పరిశ్రమకు గమ్యస్థానంగా ఉంటూ వస్తోంది.. ప్రపంచవ్యాప్తంగా విమానాల నుంచి ద్విచక్రవాహనాలు - ఫోన్లు - బాంబులు - ఇతర ఎలక్ట్రానిక్ - ఆటోమొబైల్  ఇతర వస్తువులన్నింటిని అమెరికా ఎగుమతి చేస్తుంటారు. అందుకే కరోనా ఇంత తీవ్రంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేశ ఆర్థిక దృష్ట్యా లాక్ డౌన్ విధించకుండా ప్రజల ప్రాణాలను బలిపెట్టాడు.

*భారత్ లో ఆటోమొబైల్ కుదేలేనా?

లాక్ డౌన్ తో ఇఫ్పుడు దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైనట్టే కనిపిస్తోంది. వాహనాల క్రయ విక్రయాలు ఈ సంవత్సరం కొలుకునేలా లేవు. కార్లు - ద్విచక్ర వాహనాలు కొనేంత సాహసం జనాలు ఇప్పట్లో చేయరు. ప్రస్తుతం తిండి - నిత్యావసరాలు తప్పితే విలాసాలు తీర్చుకునేంత డబ్బు జనాల దగ్గర లేదు. ఇప్పుడు లాక్ డౌన్ ముగిసినా ఇప్పటికే కోల్పోయిన ఉద్యోగి - ఉపాధిని వెతుక్కొని నిలదొక్కుకునే సరికే ఏడాది పడుతుంది. అప్పుడు కానీ వాహనాల క్రయవిక్రయాలు మొదలయ్యే అవకాశాలు దేశంలో ఉండవు. దీంతో దేశంలో ఆటోమొబైల్ రంగం కోలుకోవాలంటే ఎంత లేదన్నా సంవత్సరం దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

*అన్ని రంగాలు కుదేలవడంతో ఆటోమొబైల్ కు కష్టం

అన్ని రంగాలు బాగా ఉండి.. జనాల దగ్గర డబ్బులు బాగా ఉంటేనే దేశంలో వాహనాల క్రయవిక్రయాలు సాగుతాయి. కార్లు - వాహనాలు ఇతర లగ్జరీ వస్తువులు కొంటారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ తో అంతా తలకిందులైంది. దీంతో జనాలు తమ ఈఎంఐలు - ఇంటి అప్పులు - ఇతర వాటిని తీర్చడానికే మొగ్గు చూపుతారు. తద్వారా కొత్తగా ఏ వాహనాలు ఇప్పట్లో కొనరు. ఈ పరిణామం ఆటోమొబైల్ రంగానికి తీరని శాపంగా మారనుంది.

*ఇప్పటికే ఉత్పత్తి ఆపుచేసిన మారుతీ.. ఇతర కంపెనీలు

బీఎస్ 6 టెక్నాలజీతో వాహనాలు దేశంలో ప్రవేశపెట్టడం.. వాటికి  ధర అమాంతం పెరగడం.. ఇక ఆర్థిక మాంద్యం కారణంగా పోయిన త్రైమాసికంలోనే కార్ల కొనుగోలు లేక మారుతి ప్లాంట్లను మూసివేసింది. పులిమీద పుట్రలా ఇప్పుడు కరోనాతో మొత్తం కార్లు - ద్విచక్ర వాహనాల ఉత్పత్తే నిలిచిపోయింది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఉత్పత్తికి మరికొంత కాలం బ్రేక్ తప్పదు. ఇప్పుడు ఉత్పత్తి చేసిన వాహనాలు అమ్మితేనే మళ్లీ మొదలవుతుంది. కానీ జనాలు కొనే పరిస్థితి లేకపోవడంతో దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలుకావడం ఖాయంగా కనిపిస్తోంది..

*కోట్లమందికి ఉపాధి దూరం

ఆటోమొబైల్ పరిశ్రమపై ఆధారపడి కోట్ల మంది జీవిస్తున్నారు. షోరూంలలో పనిచేసే మెకానిక్ నుంచి ఉత్పత్తి చేసే కార్మికుల వరకూ ఈ పరిశ్రమపై ఆధారపడి ఉద్యోగ, ఉపాధి పొందే వారంతా ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే ఆస్కారం కనిపిస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో దేశంలో ఆటోమొబైల్ రంగం పెద్ద కుదుపునకు లోనుకావడం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Tags:    
  • CoronaVirus LockDown 
  • AutoMobile Industry 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS