• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అంతుచిక్కని కరోనా.?...

అంతుచిక్కని కరోనా.? హైదరాబాద్ లో వీరికెలా సోకింది?

By - Tupaki Desk
Update: 2020-04-14 14:12 GMT
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు సంఖ్య తగ్గకపోగా విపరీతంగా పెరుగుతుండడం ఆందోళనకు దారితీస్తోంది. అత్యధిక కేసులు హైదరాబాద్ లోనే నమోదవుతుండడంతో ముఖ్య మంత్రి కేసీఆర్ దీనిపై ప్రధాన దృష్టి సారించారు.

అయితే తాజాగా హైదరాబాద్ అనూహ్యమైన కరోనా కేసులు వెలుగుచూస్తుండడం వైద్యవర్గాలను సైతం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో నమోదైన రెండు కేసులు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఈ రెండు కేసులకు మర్కజ్ తోకానీ.. విదేశీ ట్రావెల్ హిస్టరీ కానీ లేకపోవడం వైద్యవర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో హైదరాబాద్ లో ఇలాంటి మరెన్ని కేసులు ఉన్నాయోనని ర్యాపిడ్ టెస్టులకు మొగ్గుచూపుతున్నారు.

తాజాగా పాజిటివ్ గా తేలిన హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు, చేతులు పనిచేయక ఇంటిలోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు.   వీళ్లలో ఎవరికి బయట లింకులు లేవు. అయినా సరే పక్షవాతం సోకిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వైద్యులను షాక్ కు గురిచేసింది.

ఇక తాజాగా టౌలిచోకీకి చెందిన 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి కుటుంబాలకు సేమ్ ఎవరితోనూ లింక్స్ లేవు. అయినా ఆమెకు కూడా కరోనా సోకింది.

తాజాగా కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకున్నా కానీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారోనన్న భయం నెలకొంది. కొంతమందిలో లక్షణాలు బయటపడడంలేదు.వారు బయట తిరుగుతూ అంటించేస్తున్నారు. ఇలా ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియని కేసులు సామూహిక దశ అని ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tags:    
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

Copyright @2026

Powered by Blink CMS