• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా అప్డేట్‌: తెలంగాణలో...

కరోనా అప్డేట్‌: తెలంగాణలో 6 మంది మృతి

By - Tupaki Desk
Update: 2020-03-31 03:57 GMT
అర్థరాత్రి తెలంగాణ లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనా బాధితులు ఏకంగా ఆరు మృతిచెందారు. ఈ విషయం తెల్లవారు తెలుసుకున్న ప్రజలు షాక్‌కు గురయ్యారు. అర్థరాత్రి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా అప్పటికే ప్రజలు నిద్రలోకి జారుకోవడంతో తెల్లవారు లేచి వార్త పత్రికలు, టీవీల్లో చూసి అవాక్కయ్యారు. వాస్తవంగా సోమవారం సాయంత్రం దాక కరోనాతో ఒకరు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనాతో కొందరు మృతిచెందారని సమాచారం ఆలస్యంగా ప్రభుత్వానికి సమాచారం చేరింది. దీంతో అర్థరాత్రి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. అందులో భాగంగా ఐదుగురు మృతిచెందారని వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఉన్న మర్కజ్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలంగాణ కు చెందిన ఆ మతస్తులు పాల్గొన్నారు. అక్కడకు వెళ్లిన వారిలో కరోనా సోకింది. ఆ సోకిన వారిలో ఆరుగురు మృతిచెందారు.

– హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి లో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
– హైదరాబాద్‌లోని అపొలో, గ్లోబల్‌ ఆస్పత్రుల్లో ఒకరు చొప్పున కరోనా పాజిటివ్‌ సోకిన వారు మృతిచెందారు.
– నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కర మరణించారు.
ఇప్పటిదాక హైదరాబాద్‌ కు పరిమితమైన కరోనా ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ కు పాకింది. ఏకంగా కరోనా మృతులు చోటు చేసుకోవడంతో ఆ జిల్లాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ మరణాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ జిల్లాల పరిధిలో హైఅలర్ట్‌ ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు కూడా సోకిందేమో అనుమానంతో వారందరినీ అదుపులోకి తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా సోకుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రార్థనలకు వెళ్లిన వారు ఎవరెవరు రాష్ట్రంలో ఉన్నారో ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రం నుంచి ఆ ప్రార్థనలకు వెళ్లిన వారు వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది.
ఈ సందర్భంగా మర్కజ్‌ కు వెళ్లిన వారిలో నాగర్‌ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన 11 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 14మంది, వనపర్తి జిల్లాకు చెందిన 65 ఏళ్ల వ్యక్తులను గుర్తించారు. వెంటనే వారిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి సత్వర వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు.
అయితే ఒక్కసారిగా కరోనా మృతులు పెరగడం తో తెలంగాణలో అలజడి మొదలైంది. నిన్నటి దాక ఒక మృతే ఉండగా ఒక్కరోజే ఐదుగురు మృతిచెందడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూ కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Tags:    
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

Copyright @2026

Powered by Blink CMS