• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా పిశాచి నుంచి...

కరోనా పిశాచి నుంచి భారతీయుల్ని కాపాడుతోంది ఆ జన్యువేనా?

By - Tupaki Desk
Update: 2020-04-10 04:15 GMT
ప్రపంచానికే పెద్దన్న అమెరికాలో కరోనా కారణంగా రోజుకు రెండు వేల మంది చనిపోతుంటే.. బ్రిటన్ లో దగ్గర దగ్గర వెయ్యి వరకూ ప్రాణాలు విడుస్తున్నారు. ఆ మాటకు వస్తే.. యూరప్ లోని పలు దేశాల్లోనూ ఇలాంటి దారుణమైన పరిస్థితే నెలకొంది. మొత్తంగా చూసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది కరోనా బారిన పడితే.. 90వేల మంది ఇప్పటి వరకూ మరణించారు. ఇక.. భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ 5865 మందికి కరోనా పాజిటివ్ గా తేలితే..దాని  కారణంగా మరణించిన వారు 591 మందిగా తేల్చారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో కరోనాను కంట్రోల్ చేసేంత సీన్ లేదన్న విషయాన్ని పాలకులు ఇప్పటికే తేల్చేస్తున్నారు.

ఆరోగ్య రంగంలో మనకున్న శక్తిసామర్థ్యాలు చాలా పరిమితమైనవి. అలాంటివేళ.. కరోనా పిశాచి బారిన పడకుండా ఎలా సేవ్ అయ్యామన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి మొదటి కారణంగా.. కరోనా తొలిదశలోనే కేంద్రం కళ్లు తెరిచి లాక్ డౌన్ విధించటం ఒకటైతే.. భారతీయుల్లో ఉన్న ప్రత్యేక జన్యువు కూడా కరోనాను తట్టుకొనేందుకు కారణమైందన్న విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. రోజుకు సరాసరి 500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నా.. మరిన్ని కీలక చర్యలు తీసుకుంటే.. ఈ సంఖ్యను తగ్గించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భారతీయుల జన్యుపటాన్ని చూసినప్పుడు hsamiR27B అనే జన్యువే కరోనా బారిన భారీగా పడకుండా చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ జన్యువే భారతీయుల శరీరాల్ని కరోనా ఛిద్రం చేయకుండా కాపాడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. దీన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సిన అవసరం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మలేరియా ప్రబలిన దేశాలు.. ప్రాంతాల్లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందటం లేదన్న విషయాన్ని ఈ మధ్యనే గుర్తించారు. మలేరియా వచ్చినప్పుడు వాడే క్లోరోక్విన్ వాడటం కూడా కరోనాను కంట్రోల్ చేసే శక్తి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కరోనా పిశాచి బారిన భారతీయులు పడకుండా ఉండటానికి  hsamiR27B అనే జన్యువుతో పాటు.. మలేరియా మందు కూడా మనకు శ్రీరామరక్షగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS