చిన్న పిల్లలకు కరోనా టీకా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిన్న పిల్లల టీకా వచ్చేసింది. 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు సంబంధించిన టీకా ను పంపిణీ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. బుధవారం నుంచి టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటికే వీటికి సంబంధించిన మార్గ దర్శకాలను కేంద్ర విడుదల చేసింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో చిన్నారుల వ్యాక్సిన్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న దాని ప్రకారం 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే చిన్న పిల్లలకు డీసీజీఐ అనుమతి పొందిన కేవలం కార్బొ వ్యాక్స్ టీకాను ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. టీకా తీసుకునేందుకు వచ్చే చిన్న పిల్లల వయసు ఆధారంగా టీకాను తీసుకోవాలని సూచించారు.
ఈ టీకాను 'బయోలాజికల్ ఈ' అనే సంస్థ తయారు చేసింది. అయితే చిన్నారులకు ఇచ్చే టీకా రెండు డోసులు ఇస్తారు. అయితే ఈ రెండు డోసులు మధ్య కనీసం 28 రోజులు ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం చిన్నారులకు ఇచ్చే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే వారి 2010 తర్వాత పుట్టిన వారు అయ్యి ఉండాలి. వారికి మాత్రమే టీకా తీసుకునేందుకు అర్హత ఉంటుంది. వీరికి 12 సంవత్సరాలు పూర్తి అయి ఉంటుంది కాబట్టి వారు టీకా తీసుకునే ముందు కొవిన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
టీకా కేంద్రం వద్ద కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అయితే టీకా వేసే వారు కూడా పిల్లల వయసు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉందా లేదా అనే దానిని నిర్ధరించుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొందరు సరిపడా వయసు లేకపోయినప్పటికీ పోర్టల్ లో నమోదు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వారికి ఎట్టి పరిస్థితిలోనూ టీకా వేయకూడదని అధికారులు పేర్కొన్నారు.
పిల్లలకు టీకా వేయించేందుకు తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలా కాకపోయినా సరే సరాసరి టీకా కేంద్రం వద్దకు వెళ్లి అయినా సరే నమోదు చేసుకోవాలని సూచించారు.
టీకా పంపిణీ కేంద్రాలకు తీసుకుని వెళ్లేటప్పుడు సదరు వయసు ఉండే పిల్లలను వారికి నిర్దేశించిన సెషన్ లోనే వెళ్లి టీకా తీసుకోవాలని సూచించింది. టీకా పంపిణీ కార్యక్రమంలో ఉన్నత వర్గాలకు, పేద వారు అనే వ్యత్యాసం లేకుండా టీకా పంపిణీ చేయాలని సూచించింది.