కరోనా టీకా డోర్ డెలివరీ...వాహనం ప్రారంభం , ఎక్కడంటే ?
మన దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం రోజురోజుకి తీవ్రస్థాయిలో పెరుగుతుంది. లక్షల్లో పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే. అయితే దేశంలో బాధితులు ఎక్కువగా ఉండటం, వ్యాక్సిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉండటం తో అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీనితో ఈ మద్యే మరో రెండు వ్యాక్సిన్లకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే..బ్రహ్మపుర నగరపాలక సంస్థ పరిధిలో వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన ఇతర పీడితులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి కొవిడ్ టీకాలు వేయాలన్న లక్ష్యంతో 'వ్యాక్సినేషన్ ఎట్ డోర్‌స్టెప్' పేరిట సంచార వాహనానికి సోమవారం ప్రారంభించారు.
ఉదయం స్థానిక బీఈఎంసీ కార్యాలయం ఆవరణలో ఈ వాహనానికి బ్రహ్మపుర ఎమ్మెల్యే బిక్రం కుమార్ పండా పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంజాం కలెక్టరు విజయ అమృత కుళంగె విలేకరులతో మాట్లాడుతూ ఇళ్ల నుంచి బయటకు రాలేని వారి ఇళ్లకు వెళ్లి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేయాలని పలువురు నగరవాసులు కోరారని, ఈమేరకు ఈ వాహన సేవలు ప్రారంభించామని తెలిపారు. ముందురోజు సంబంధిత టెలీఫోను నెంబరుకు ఫోను చేసి స్లాట్ బుక్ చేసుకున్న వారి ఇళ్లకు వాహనంలో సిబ్బంది వెళ్లి టీకాలు వేస్తారని చెప్పారు. అత్యధికంగా ఓ వాహనం ద్వారా రోజుకు వంద మందికి టీకాలు వేయవచ్చునని, స్లాట్ల బుకింగ్, టీకాల లభ్యత, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టరు కుళంగె తెలిపారు. కరోనాపై ప్రజా చైతన్యానికి ఓ ద్విచక్ర వాహనానికి వైరస్ ఆకృతిని అమర్చి వినూత్నంగా తయారు చేశారు. ఈ వాహనాన్ని కూడా ప్రారంభించారు.