అబార్షన్ పిండం కణాలతో ట్రంప్ కి కరోనాట్రీట్మెంట్ !

Update: 2020-10-09 09:45 GMT
అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. దీనితో కరోనా చికిత్స కోసం అమెరికాలోని వాల్టర్ రీడ్ సైనికాస్పత్రిలో జాయిన్ అయ్యి , అక్కడ  చికిత్స పొంది అక్కడి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తరువాత ట్రంప్ ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. బహుశా నేను రోగ నిరోధక శక్తిని కలిగిఉన్నానని అనుకుంటున్నాను. కోవిడ్ కు ఎవరూ భయపడొద్దు.. దానిని  మన జీవితాలపై ఆధిపత్యం చలాయించేలా చూడకూడదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ వీడియో విడుదల చేశారు.

అయితే , అధ్యక్షుడు రోనా నుంచి బయటపడానికి వైద్యులు ఎలాంటి చికిత్స అందించారనే దానిపై ఇప్పుడు  రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా  పిండంలో పెరుగుతున్న కణాలతో ట్రంప్ కి చికిత్స చేశారని ఓ వార్త  ప్రచారం అవుతుంది. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడం వల్ల బతుకుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు.  నాలుగురోజుల పాటు ట్రంప్.. కొత్త పద్ధతిలో చికిత్స తీసుకున్నారు.అబార్షన్ చేయించుకున్న పిండంలోని కిడ్నీల నుంచి కణాలు తీసి, ట్రంప్ కు చికిత్స అందించారని తెలుస్తోంది. ఈ కణాలు 8 గ్రాములున్నాయి. పిండాల నుంచి తీసిన కణాలతో ల్యాబలేటరీలో ఉత్పత్తులను తయారు చేస్తుంటారు.

HEK-293T సెల్స్  గా పిలుస్తుంటారు. అబార్షన్‌ చట్టాన్ని ఎత్తివేస్తామని అప్పట్లో ట్రంప్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అబార్షన్ మీద కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టాలు విధించారు. కరోనా సోకిన ట్రంప్‌కు మొత్తం 9 డ్రగ్స్ సాయంతో వేర్వేరు చికిత్సలు జరిగాయి. అధ్యక్షుడి హోదాలో ఆస్పత్రిలోనే అతి తక్కువ సమయంలో వివిధ రకాల 9 ట్రీట్ మెంట్స్ ఇచ్చారు. REGN-COV2 ప్రయోగాత్మక డ్రగ్ ను సింగిల్ డోస్ ఇచ్చారు. వైరస్ తో పోరాడే రోగ నిరోధతను పెంచేందుకు యాంటీబాడీల కోసం ఈ డ్రగ్ వాడుతారు. శక్తివంతమైన స్టెరాయిడ్ డెక్సా మెథాసోన్  కూడా ట్రంప్ కు చికిత్సలో అందించారు. అయితే , అబార్షన్ పిండం కణాలతో ట్రంప్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు అని ప్రచారం అవుతున్న వార్తలను  ట్రంప్ మద్దతుదారులు  ఖండించారు.
Tags:    

Similar News