పోలండ్ దేశాధ్యక్షుడికి కరోనా! కరోనా సెకండ్​ వేవ్​ స్టార్ట్​ అయ్యిందా?

Update: 2020-10-25 04:16 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు యావత్​ ప్రపంచం విలవిలలాడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4.20 కోట్ల కేసులు నమోదయ్యాయి. దేశాధినేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

యూరప్ లో కరోనా తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా అక్కడ కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక పరిస్థితి చక్క బడింది కదా అనుకుంటుండగా   మళ్లీ పరిస్థితి మారిపోయింది.
 తాజాగా అక్కడ కొత్త కేసులు పెరుగుతుండంతో కరోనా సెకండ్​ వేవ్​ ప్రారంభమైందేమోనని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

సెకండ్ వేవ్ వస్తే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది.  సామాన్యుల నుంచి రాజకీయనాయకులు, దేశాధ్యక్షులు ఎవర్ని కరోనా వదలడం లేదు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో పాటు అనేక దేశాలకు చెందిన ప్రధానులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  ఇటీవల పోలండ్ దేశాధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా కరోనా బారిన పడ్డారు.  ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ తెలియజేసింది.  ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్యం నిలకడగానే వుందని ప్రకటించారు. అయితే, ఇటీవలే బల్గెరియా అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ పోలండ్ అధ్యక్షుడితో సమావేశం అయ్యారు.  పోలండ్ అధ్యక్షుడికి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే బల్గెరియా అధ్యక్షుడు కూడా హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు.
Tags:    

Similar News