కరోనా : దగ్గు, జ్వరానికి ముందే ఈ 4 లక్షణాలు బయటపడతాయి !

Update: 2020-10-09 11:00 GMT
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒకరిని ప్రాణ భయం ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈ మహమ్మారి సోకి వేలకొద్ది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ,కరోనా సోకినా విషయం ఎంత వేగంగా తెలుసుకోగలిగితే అంత ప్రమాదం తప్పుతుంది అని వైద్యులు చెప్తున్నారు.  ఈ వైరస్ పట్ల అస్సలు నిర్లక్ష్యం వద్దు. దీనికి సంబంధించి ఏ  చిన్న లక్షణం బయటపడినా.. వెంటనే  చికిత్స తీసుకోండి. ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే.. కరోనా వైరస్ అందరిలో ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిపై ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతుంది.

ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, డయాబెటీస్ తదితర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.  కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా పై అవగాహన పెంచుకోవాలి. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వేధిస్తుంటే తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలి.  అయితే, ఈ లక్షణాలు కంటే ముందే మరికొన్ని ముందస్తు లక్షణాలు కరోనాను సూచిస్తాయట. అవేంటో తెలుసుకుంటే.. వైరస్ మిమ్నల్ని పూర్తిగా స్వాధీనం చేసుకొనే లోపే కరోనా ను మీ నుండి తరిమి కొట్టవచ్చు. ఆ లక్షణాలు ఏమిటో  ఇప్పుడు చూద్దాం..

ఇప్పటివరకు కరోనా వస్తే.. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి అని ప్రధాన కారణాలే చెప్పేవారు. అవే కాకుండా కొంతమంది కరోనా బాధితుల్లో వేరే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయట. తలనొప్పి, వాసన, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. ఈ నేపథ్యంలో కరోనా కేవలం శ్వాసకోశ వ్యవస్థ మీదే కాకుండా కొంతమంది బాధితుల్లో నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ సందర్భంగా 4 రకాల నాడీ సమస్యలను గుర్తించారు.

అన్నాల్స్ ఆఫ్ న్యూరోలజీ అధ్యయనంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. కరోనా బాధితుల్లో ఎక్కువ మందికి నాడీ సంబంధ లక్షణాలు కనిపిస్తున్నాయని స్డడీలో తెలిపారు. తలనొప్పి, మైకం, స్ట్రోక్, అప్రమత్తంగా ఉండలేకపోవడం వంటి నాలుగు లక్షణాలు వారిలో కనిపిస్తున్నాయట. మరికొందరు బాధితుల్లో వాసన, రుచి చూడలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్.. తమ పరిశోధనలో భాగంగా 19 మంది కరోనా బాధితులను పరీక్షించింది. వీరిలో కరోనాకు సంబంధించిన ప్రధాన లక్షణాల కంటే ముందే.. నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై  మీ ప్రాణాలు , మీ పక్క వారి ప్రాణాలను కాపాడండి.
Tags:    

Similar News