• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీవీఐపీలకు కూడా..:...

వీవీఐపీలకు కూడా..: రాష్ట్రపతికి కరోనా పరీక్షలు

By - Tupaki Desk
Update: 2020-03-21 06:10 GMT
కరోనా వైరస్ వ్యాప్తి వీవీఐపీలను కూడా తాకింది. ఆ వైరస్ వ్యాప్తి ఏకంగా దేశ ప్రథమ పౌరుడు నివసించే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు పాకింది. కరోనా అనుమానితులు ఉన్నవారు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరవడంతో కలకలం రేగింది. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి కూడా కరోనా వచ్చిందనే భయం అందర్ని చుట్టుముడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఆ వైరస్ పాకిందేమోననే అనుమానంతో ఆయనకు కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయనున్నారు. దీంతో కరోనా వైరస్ ప్రభావం సామాన్యులతో పాటు వీవీఐపీల పై కూడా పడిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన పర్యటనలన్నింటిని రద్దు చేసుకున్నారు.

ఇటీవల లండన్ సింగర్ కనికా కపూర్‌ తిరిగొచ్చి ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని ఓ హోటల్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులకు ఆమె పార్టీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రెయిన్ హాజరయ్యారు. కరోనా లక్షణాలతో ఉన్న ఆమెను కలిసిన ఎంపీ దుష్యంత్ అనంతరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దుష్యంత్ రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి ఫొటోలు దిగి మాట్లాడారు. అయితే కనికా కపూర్ కు కరోనా లక్షణాలున్నాయని తేలడంతో ఆమెను కలిసిన దుష్యంత్ కు కూడా ఆ వైరస్ సోకి ఉంటుందని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో దుష్యంత్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవడంతో రాష్ట్రపతి భవన్ ఒక్కసారిగా షాక్ కు గురైంది.  అయితే వసుంధర రాజే, ఆమె కుమారుడు ఎంపీ దుష్యంత్ స్వీయ నిర్బంధం (క్వారెంటైన్)లో ఉన్నారని తెలియడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు రాష్ట్రపతికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. కనికా కపూర్ ను కలిసిన అనంతరం ఢిల్లీ వచ్చి రాష్ట్రపతి భవన్ తో పాటు దాదాపు రెండు గంటల పాటు పార్లమెంటు భవనంలో గడిపారు. దీంతో పార్లమెంట్ సమావేశాలను రద్దు చేయాల్సిందిగా తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ కోరారు. అతడి రాకతో తమకు కరోనా వైరస్ సోకిందని వ్యక్తం చేశారు.
Tags:    
  • tupaki news 
  • tupaki updates 
  • tupaki latest news 
  • upcoming news 
  • news for tupaki 
  • tollywood news 
  • movie gossips 
  • movie updates 
  • upcoming movies 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS