దేశంలో కరోనా రెండో దశకు కారణాలు ఇవేనా?

Update: 2021-05-05 07:32 GMT
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. పడకలు లేక, ఆక్సిజన్ అందక ఇప్పటికే చాలామంది అసువులు బాసారు. దీనిపై రిజ్వర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. భారత్ లో రెండో దశలో కొవిడ్ విజృంభించడానికి కారణాలను అంచనా వేశారు.

దేశంలో కరోనా విలయతాండవం చేయడానికి ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ముందుచూపు, నాయకత్వ లేమితోనే ఈ విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభుత్వ జాగ్రత్తగా వ్యవహరించి... ముందు నుంచి అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వైఫల్యమే సెకండ్ వేవ్ కు కారణం అని తీవ్ర విమర్శలు చేశారు.

ప్రపంచ దేశాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బ్రెజిల్ పరిస్థితులను గమనించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. మహమ్మారిని కట్టడి చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇకపోతే వైరస్ ను ఎదుర్కొన్నామని గతంలో ప్రకటించిన ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఏమంటారని ప్రశ్నించారు.

కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేయకపోగా... వ్యాక్సినేషన్ ప్రక్రియగా నెమ్మదిగా సాగుతోందని విమర్శించారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి టీకా కార్యక్రమాన్ని చురుగ్గు చేపట్టాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టాలని కోరారు. మార్చి నుంచి కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు.
Tags:    

Similar News