అమరావతి- ఆశలను నిజం చేసే దిశగా
ఇక ఏకధాటిగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ పనులను చేపట్టారు. మొత్తం నిర్మాణంలో 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తుండగా ఇందులో ఇప్పటికే 15,000 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది.;
ఏపీ రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణం పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇది శుభ పరిణామం అని అంటున్నారు. ఒక్కసారిగా వేగం పుంజుకుని ఆశలను నిజం చేసే దిశగా సాగుతున్నాయి. ఒకనాడు బోసి పోయి పాడు పెట్టబడిన అమరావతి ఇపుడు పచ్చని తోరణాలతో ముస్తాబు అవుతోంది. అందంగా తయారు అవుతోంది. శాశ్వతమైన భవనాలతో ఆకాశాన్ని అంటే హర్మ్యాలతో అమరావతి సరికొత్త కళను అద్దుతోంది. ఏపీకి నూతన కాంతులను అందిస్తోంది.
హైకోర్టు భవనాలలో :
ఇదిలా ఉంటే అమరావతిలో సువిశాలమైన ప్రాంగణంలో హైకోర్టు నిర్మాణం పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు అయితే ఇపుడు స్పీడ్ గా సాగుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.అనూహ్యంగా నిర్మాణంలో వేగం పుంజుకున్నాయి. తాజాగా చూస్తే హైకోర్టు నిర్మాణ ప్రాంగణంలో ఒకేసారి 4 రాఫ్ట్‌లలో కాంక్రీట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. ఈ
ఏకధాటిగా నిర్మాణం :
ఇక ఏకధాటిగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ పనులను చేపట్టారు. మొత్తం నిర్మాణంలో 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తుండగా ఇందులో ఇప్పటికే 15,000 క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. అంటే పాతిక శాతం అన్న మాట. తాజాగా 15,000 క్యూబిక్ మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇలా హైకోర్టు భవనాన్ని బేస్‌మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 8 అంతస్తులు విధానంలో 50.4 మీటర్ల ఎత్తుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాదికి పూర్తి :
ఈ వేగం చూస్తూంటే వచ్చే ఏడాది మొదటికే హైకోర్టు శాశ్వతమైన భవనాలలోకి వెళ్లనుంది అని అంటున్నారు. అలాగే సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ పనులు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఇక ఉద్యోగులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు మంత్రుల భవన సముదాయాలు కూడా క్రమ పద్ధతిలో సాగుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఏ మాత్రం ఆలస్యం లేకుండా చూస్తోంది.
నిధుల కొరత లేకుండా :
ఇక నిధుల విషయంలో అయితే పెద్దగా ఇబ్బంది అయితే లేదు. దాంతో పనులు జోరందుకున్నాయి. తాజా బడ్జెట్ లో మరో ఆరు వేల కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఇదిలా ఉంటే 2028 నాటికి అమరావతిలో పరిపాలనకు సంబంధించిన భవానాలు అన్నీ పూర్తిగా సిద్ధం అవుతాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వాటినే కూటమి ప్రభుత్వం ప్రజల ముందు పెట్టి 2029 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు ప్రజా తీర్పుని కోరనుంది అని అంటున్నారు.