బోయ‌ల‌కూ వైసీపీ వెన్నుపోటు: టీడీపీ

బోయ సామాజిక వ‌ర్గానికి వైసీపీ వెన్నుపోటు పొడిచింద‌ని టీడీపీ మాజీ మంత్రి, రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమ‌ర్శించారు.;

Update: 2026-02-21 04:17 GMT

బోయ సామాజిక వ‌ర్గానికి వైసీపీ వెన్నుపోటు పొడిచింద‌ని టీడీపీ మాజీ మంత్రి, రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమ‌ర్శించారు. ఏపీలో బోయ‌లు బీసీలుగా ఉన్నార‌ని.. కానీ, ప‌క్క‌నే ఉన్న‌ క‌ర్ణాట‌క‌లో మాత్రం బోయ‌లు.. ఎస్టీలుగా ఉన్నార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు వారికి అందుతు న్నాయ‌న్నారు. కానీ, ఏపీలోని బోయ‌ల‌కు ముఖ్యంగా సీమ ప్రాంతంలోని వారికి తీవ్ర అన్యాయం జ‌రుగు తోంద‌న్నారు.

నా ఎస్సీ, ఎస్టీ అంటూనే.. వైసీపీ ప్ర‌భుత్వం గ‌తంలో బోయ‌ల‌కు అన్యాయం చేసింద‌న్నారు. 2014-19 మ‌ధ్య టీడీపీ ప్ర‌భుత్వం బోయ‌ల‌ను ఎస్టీలుగా ప‌రిగ‌ణించాల‌ని కోరుతూ.. కేంద్రానికి నివేదిక పంపించిం ద‌ని కాల్వ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోయ సామాజిక వ‌ర్గాన్ని ఎస్టీలుగా ప‌రిగ‌ణించాల‌ని కోరు తూ.. అసెంబ్లీలోనూ తీర్మానం చేశార‌ని గుర్తు చేశారు. దీనిని కేంద్రానికి పంపించార‌ని.. అయితే.. కేంద్రం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు వ‌చ్చాయ‌న్నారు.

ఈ లోగా వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని, కేంద్రం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు.. వైసీపీ స‌రైన స‌మాధానాలు ఇవ్వ‌లే ద‌ని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. దీనికితోడు.. బోయ‌ల‌కు ఎస్టీ హోదాను.. కేవ‌లం సీమ ప్రాంతంలో ని వారికి ప‌రిమితం చేస్తే స‌రిపోతుంద‌ని కూడా పేర్కొన్నార‌ని. దీంతో కేంద్రం మొత్తానికే ఈ విష‌యాన్ని అట‌కెక్కించింద‌ని చెప్పారు. వైసీపీ హ‌యాంలోనే బోయ‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. వారికి వెన్నుపోటు పొడిచార‌ని కాల్వ ఆరోపించారు.

ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వ‌మైనా బోయ‌ల‌కు ఎస్టీ హోదా క‌ల్పించే విష‌యంపై చర్య‌లు తీసుకోవాల‌ని కాల్వ విన్న‌వించారు. కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించినట్లే.. మ‌న రాష్ట్రంలోనూ బోయ సామాజిక వ‌ర్గానికి ఎస్టీ హోదా కల్పించాలన్నారు. అప్పుడు అత్యంత వెనుక‌బ‌డి ఉన్న బోయ సామాజిక వ‌ర్గానికి న్యాయం జ‌రుగుతుంద‌ని.. విద్య, ఉపాధి రంగాల్లో స‌మాన స్థాయి, అవ‌కాశాలు స‌మ‌కూరుతాయ‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు అసెంబ్లీలో ఆయ‌న స‌ర్కారుకు విన్న‌వించారు.

Tags:    

Similar News