బ్రేకింగ్ : ఢిల్లీలో ఒకరి వల్ల 900 మందికి కరోనా !

Update: 2020-03-26 09:45 GMT
కరోనా వైరస్ గా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి నుండి స్థానికుల‌కు ఈ కరోనా సోకుతుంది.  తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఓ మ‌హిళ ద్వారా ఓ డాక్ట‌ర్‌ కు క‌రోనా వైర‌స్ సోకింది. టెస్టులు చేయ‌గా పాజిటివ్‌గా తేలింది. అయితే , ఈ డాక్టర్ కి కరోనా సోకిన తరువాత కూడా సుమారుగా  900 మందికి పైగా ట్రీట్ మెంట్ చేసినట్టు తెలియడంతో వారందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా - వీరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. వీరందరినీ 14 రోజులపాటు ఐసొలేషన్ కి పంపినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి ఎస్.జైన్ వెల్లడించారు.

ఈశాన్య ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ లో పని చేస్తున్న వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈశాన్య ఢిల్లీలో గల ఈ డాక్టర్ క్లినిక్ కి ఈ నెల 12-18 తేదీల మధ్య తమ జబ్బుల చికిత్స కోసం వఛ్చిన వారంతా కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు.  కోవిడ్ బారిన పడ్డ ఆ డాక్టర్‌ ను 15 రోజుల క్రితం మొహల్లా క్లినిక్‌ లో ఓ మహిళ వెళ్లి కలిసిందని, ఆమె ద్వారానే ఆయనకు వ్యాధి సంక్రమించిందని సమాచారం. అలాగే  ప్రాథమిక పరీక్షల్లో డాక్టర్ భార్య - కూతురుకు కూడా కరోనా పాజిటివ్‌ గా  తేలడంతో వారిని కూడా ఐసోలేషన్ కి తరలించినట్టు సమాచారం.

అనారోగ్యం బారిన పడిన ఆ డాక్టర్ ముందుగా జీటీబీ హాస్పిటల్‌ లో చేరగా.. అనంతరం సఫ్దర్‌ జంగ్ హాస్పిటల్‌ కు తరలించారు. అక్కడ ఆయన్ని  ఐసీయూలో ఉంచి చికిత్స అందిచామని.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక ఐసోలేషన్ రూమ్‌ కి తరలించామని ఆయన కొలీగ్ అయిన డాక్టర్ హరీష్ గుప్తా తెలిపారు. మొత్తంగా ఇప్పుడు ఒక మహిళా వల్ల 900 మంది ఈ మహమ్మారి వలలో చిక్కుకున్నారు.

Tags:    

Similar News