కరోనా ఎఫెక్ట్ : రూ . 23 లక్షల కోట్లు నష్టపోయిన పర్యాటక రంగం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. చైనాలో గత ఏడాది వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించింది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా దెబ్బకి వణికి పోతోంది. ప్రపంచం లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదు అయ్యాయి. మొదట్లో భారత్ లో కరోనా కంట్రోల్ లోనే ఉన్నది అనుకున్నప్పటికీ కూడా .. ఆ తరువాత ఇండియా వేగం పుంజుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే రోజువారీ కేసులో భారత్ అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా ప్రతిరోజూ కూడా 60 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 32 లక్షలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఇకపోతే, ఈ కరోనా కారణంగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో..ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా పర్యాటక రంగం పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు కి కొన్ని కోట్ల మంది పర్యాటక ప్రదేశాలకి వెళ్తుంటారు. కానీ , కరోనా విజృంభణ నేపథ్యంలో .. ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమని అసలు పర్యాటక ప్రదేశాల వైపు కన్నెత్తి చూడటం లేదు. టూరిస్ట్ లకి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా కుడి ఇప్పట్లో ఎవరు ఆ ధైర్య సాహసాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యం లోనే ఐక్యరాజ్య సమితి కీలక సమాచారాన్ని వెల్లడించింది.
కరోనా కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది పర్యాటక రంగమే అని , ఈ ఏడాది తోలి ఐదు నెలల్లో 320 బిలియన్ల డాలర్లు అంటే 23 లక్షల కోట్లు నష్టం వచ్చినట్టు వెల్లడించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 10. 20 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్టు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో చమురు , కెమికల్ రంగాల తరువాత పర్యాటక రంగం వాటానే ఎక్కువ అని , దీని ద్వారా భూమి పై ఉన్న ప్రతి 10 మందిలో ఒకరు ఉపాధి పొందుతున్నారని తెలిపింది.