కరోనా దెబ్బకి రూ.90 వేల కోట్ల నష్టంలో ఆతిద్యరంగం!
మనిషి కంటికి కనిపించని కరోనా వైరస్ ఆహ్లాదాన్ని హరించింది. పర్యాటక రంగాన్ని పడకేసేలా చేసింది. లాక్‌డౌన్ ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. 2020 లో 90 వేల కోట్ల మేర పర్యాటక రంగం నష్టపోయిందని హెచ్ వి ఎస్ అనరాక్ నివేదిక అంచనా వేసింది. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 5కోట్ల మంది ఉద్యోగ, ఉపాధికి ముప్పు వాటిల్లిందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 50వేలకు పైగా వివిధ రకాల స్టార్ హోటళ్లు, 5లక్షలకు పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయని తెలిపింది.
వీధుల్లో ఉండే చిన్న.. చిన్న టిఫిన్ సెంటర్లు, టీకొట్లపై విక్రయాలు కనిపించకుండా పోయాయి. వీటిని కూడా లెక్కలోకి తీసుకుంటే ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో హోటల్స్, రెస్టారెంట్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సాధారణ సదుపాయాలతో రెస్టారెంట్ నిర్వహించాలంటే సుమారు 30లక్షల పెట్టుబడి పెట్టాలి. వంట మాస్టర్స్ నుంచి క్లీనర్లు, బేరర్ల వరకు ఒక్కో రెస్టారెంట్ లో సగటును 30మంది పని చేస్తారు. లీజు తీసుకుంటే మాత్రం నెలకు కనిష్టంగా రూ.2లక్షల అద్దె చెల్లించాల్సిందే. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్ల మొతలు సరేసరి. రెస్టారెంట్ లోనూ ఏసీలు, ఫ్యాన్లు ఉండాల్సిందే. విద్యుత్ చార్జీలు కమర్షియల్ టారీఫ్ లో గూబ గుయ్యిమనిపి స్తుంటాయి.
ఇప్పుడు ఈ తరహా రెస్టారెంట్లు, హోటళ్లు కొంచెం కొంచెంగా తెరచుకుంటున్నాయి. లాక్ డౌన్ నుండి సడలింపులు, దేశీయ ప్రయాణాలు మొదలు కావడం, అలాగే కరోనా పై ప్రజల్లో అవగాహన రావడంతో పాటుగా భయం తొలగిపోవడం తో మళ్లీ ఇప్పుడిప్పడే ఆతిధ్యం రంగం కోలుకుంటుంది. ప్రస్తుతం గోవా , రాజస్థాన్ రాష్ట్రాల్లో హోటళ్ల ఆక్యుపెన్సీ పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ లో 10 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేటు, సెప్టెంబర్ నాటికీ 26 శాతానికి పెరిగిపోయింది. లాక్ డౌన్ తొలగించినా కరోనా కష్టాలు మరికొంతకాలం వెంటాడుతాయని, ఇప్పుడిప్పడే మళ్లీ ఆతిధ్య రంగం కుదుటపడుతుంది.