మోడీ విమానంపైనా కరోనా ప్రభావం పడిందట!

Update: 2020-08-26 05:00 GMT
దేశ ప్రధాని నరేంద్రమోడీ వినియోగించేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతికతో తయారవుతున్న ప్రత్యేక విమానం భారత్ కు డెలివరీ విషయంలో మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. అప్ గ్రేడెడ్ వెర్షన్ లో రూపుదిద్దుకుంటున్న బీ777 విమానం భారత్ కు చేరుకోవటానికి మరింత ఆలస్యమవుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం ఏమిటన్న విషయంపై ఆసక్తికర వాదన వినిపిస్తోంది.

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి.. ప్రధాని ప్రయాణాల కోసం రెండు కొత్త విమానాల్ని బుక్ చేయటం తెలిసిందే. ప్రస్తుతం వారు బీ 747 విమానాల్ని వినియోగిస్తున్నారు. బోయింగ్ నుంచి ఈ విమానాల్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ వాటి నిర్వహణ మొత్తం ఎయిర్ ఇండియానే చూసుకోనుంది. ఈ విమానాల్లో సెల్ప్ ప్రోటెక్షన్ సూట్లను ఉపయోగిస్తారు. ఎయిర్ ఇండియా వన్ గుర్తును ఈ విమానాలు కలిగి ఉంటాయి.

షెడ్యూల్ ప్రకారం ఈ విమానాల్లో ఒకటి ఈ నెలాఖరు లోపు భారత్ కు చేరుకోవాల్సి ఉంది. కరోనా ప్రభావం కారణంగా ఈ విమాన డెలివరీ ఆలస్యమవుతుందని అధికారులు చెబుుతన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ విమానాన్ని ఇండియాకు తీసుకురావటానికి ఎయిర్ ఫోర్సు పైలెట్లు అమెరికాకు వెళ్లారు. అయితే.. టెక్నికల్ ఇబ్బందుల నేపథ్యంలో మరికొద్దిరోజులు ఆలస్యంగా దేశానికి చేరుకోనుంది. మొదటి విమానం బాటలోనే రెండో విమానం కూడా ఆలస్యంగానే భారత్ కు చేరుకుంటుందని చెబుతున్నారు.
Tags:    

Similar News