విడ్డూరం.. కరోనా నివారణకు బిస్కట్లు వచ్చేశాయి

Update: 2021-06-26 11:30 GMT
దేనిని భయపడని వారు.. ఏ సమయంలో కూడా లొంగని వారు ప్రాణ భయం కలిగిన సమయంలో ఏం చేసేందుకు అయినా సిద్దంగా ఉంటారు. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదంటూ ఆ సమయంలో అవకాశం ఉన్న అన్ని దారుల్లో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కరోనా ప్రాణ భయంను కలిగిస్తుంది. ఈ సమయంలో కరోనాను ఎదుర్కొనేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కరోనాతో చనిపోతున్నారు అని తెలిసి పెద్ద ఎత్తున జనాలు భయంతో వణికి పోతూ కరోనా వచ్చిన వెంటనే వేల నుండి లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆందోళనతో ఆ సమస్యను మరింతగా పెంచుకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు తమ వ్యాపారంను కూడా చేసుకుంటున్నారు.

కొందరు మోసగాళ్లు తయారు అవుతే కొందరేమో కరోనా ఔషదాలను బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. కరోనా ను తగ్గించే ఔషదం అంటూ ఇప్పటికే చాలా రకాల మందులు వచ్చాయి. కొత్తగా ఒక ఔషదం వచ్చిందట. అది బిస్కట్‌ రూపంలో లభిస్తుందట. బయోగ్రీన్ రెమిడిస్ సంస్థ వారు తయారు చేసిన బిస్కట్లు కరోనా ను తగ్గిస్తాయట. ఈ బిస్కట్‌ లలో ఉన్న ఇమ్యూనిటీ పవర్‌ కరోనాను వారం నుండి పది రోజుల వ్యవధిలో తగ్గిస్తుందని సంస్థ చైర్మన్‌ కృష్ణ ప్రసాద్ అన్నారు.

కరోనా సోకిన వారిపై తమ బిస్కట్లను ప్రయోగించిన సమయంలో 88 శాతం మందికి 7 రోజుల్లో కరోనా తగ్గగా 12 శాతం మందికి మాత్రం 10 రోజుల్లో కరోనా తగ్గిందని.. కరోనా నుండి స్పీడ్‌ గా రికవరీ అవ్వడంతో పాటు పలు అనారోగ్య సమస్యల నుండి కూడా తమ బిస్కట్ లు కాపాడుతాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన వారు సహజంగానే వారం నుండి రెండు వారాల పాటు బయట పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో వారు మంచి ఇమ్యూనిటీ పవర్‌ ను ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తారు. ఆ సమయంలో ఈ బిస్కట్స్ ను తింటే మంచిదని వారు అంటున్నారు.

హైదరాబాద్‌ లో ఈ బిస్కట్లను కార్తీక దీపం డాక్టర్ బాబు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు ఈ బిస్కట్స్ ను వినియోగించాలని సూచించాడు. ఇమ్యూనిటీ బూస్టర్స్‌ గా పని చేసే ఈ బిస్కట్స్‌ ను ప్రతి ఒక్కరు కరోనా వచ్చినా లేకున్నా తింటే మంచిదని కార్యక్రమంలో పాల్గొన్న ఇతరులు అంటున్నారు.
Tags:    

Similar News