రాష్ట్రపతి భవన్ లో నేతాజీ ఫొటోపై వివాదం

Update: 2021-01-25 16:14 GMT
తాజాగా సుభాష్ చంద్రబోస్ జయంతిని జనవరి 23న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దీన్ని కేంద్రం 'పరాక్రమ్ దివస్' గా ప్రకటించింది. కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో పీఎం మోడీ, బెంగాల్ సీఎం మమత పాల్గొన్నారు.ఈ క్రమంలోనే నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాన్ని రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్ శనివారం ఆవిష్కరించారు. అయితే ఈ ఫొటో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది.

రాష్ట్రపతి భవన్ లో కోవిండ్ ఆవిష్కరించిన ఫొటో నేతాజీది కాదని.. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా 2019లో తెరకెక్కిన 'గుమ్నమీ' అనే సినిమాలోని నేతాజీ పాత్ర పోషించిన ప్రసేన్ జిత్ ఛటర్జీది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహౌ మెయిత్రా ట్విట్టర్ లో ఆధారాలతో సహా ట్వీట్ చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది.బీజేపీవర్గాలు ఈ వివాదాన్ని ఖండించాయి. ఈ ఫొటోను నేతాజీ కుటుంబం అందజేసిందని.. ప్రముఖ చిత్రకారుడు పరేశ్ మైటీ గీశారని పేర్కొంది.
Tags:    

Similar News