తెలంగాణ లో చిచ్చు రేపుతున్న ఒక్క ఓటు
మున్సిపల్ ఎన్నికల్లో కారు హైస్పీడ్ తో దూసుకెళ్లింది. 130 స్థానాల్లో ఏకంగా 122 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని అధికార పార్టీ తిరుగులేని విజయం పొందింది. ఎన్నికలు ముగిశాయి.. మున్సిపల్ పాలక మండళ్లు కొలువుదీరాయి. అంతా ప్రశాంతంగా ఉన్నా ఒక్క ఓటు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో రెండో పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుపొంది చైర్మన్ పీఠం సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్‌ఎస్ పావులు కదిపి ఆ స్థానాలను తన కారులో వేసుకుని రయ్‌మంది.
అందులో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన స్థానం నేరెడుచర్ల, తుక్కుగూడ. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. నేరెడుచర్లలో మొత్తం 14 స్థానాల్లో కాంగ్రెస్ ఏడింటిలో గెలుపొంది మున్సిపాలిటీ పీఠంపై కూర్చోవాలి. అయితే టీఆర్‌ఎస్ ముందస్తు వ్యూహంతో ఎక్స్ అఫిషియో ఓటుతో వేసుకుని నేరెడుచర్ల స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఎక్స్ అఫిషియో ఓటు వేయడానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటు విషయంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన చెల్లుతుందని చెప్పిన కలెక్టర్ బదిలీ కాగా, ఆ తర్వాత ఆ ఓటు చెల్లదని చెప్పడంతో ఆ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది.
అయితే కేవీపీ ఓటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిదని టీఆర్ఎస్ ఆరోపించింది. అయితే తుక్కుగూడ లో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు ఓటు కూడా చెల్లదని కాంగ్రెస్ ప్రత్యారోపణ చేసింది. దీంతో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మొన్న గవర్నర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఓటు పై న్యాయస్థానం ముందుకు వెళ్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.
వాస్తవంగా రాష్ట్ర విభజనకు ముందు కేవీపీ, కేకే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం వీరిద్దరినీ చెరో రాష్ట్రానికి కేటాయించాలి. అయితే కేవీపీని తెలంగాణ కు, కేకేను ఏపీకి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో వారు ఎక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారో రగడ మొదలైంది. కేవీపీ తెలంగాణ ఎంపీ అని పేర్కొంటూ అతడి ఓటును కాంగ్రెస్ నేరెడుచర్ల లో వినియోగించుకునేందుకు ప్రయత్నించింది. ఇది తప్పు అని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అతడి ఓటు చెల్లదని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అసలు తెలంగాణ, ఏపీకి చెందిన వారెవరు అనే విషయంపై సంశయం ఏర్పడింది.
కొన్నాళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేవీపీని, తెలంగాణకు కేకేను కేటాయిస్తూ గెజిట్ ప్రకటించిందని టీఆర్ఎస్ చెబుతోంది. అయితే అలాంటి ప్రకటన రాలేదు.. కేకే ఏపీకి చెందిన ఎంపీ అంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. దీంతో ఈ ఓటు విషయంలో హైకోర్టుకు వెళ్తున్నట్లు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మరీ కేకే, కేవీపీ రాష్ట్రం విషయంలో త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా జరుగుతుందో ఎదురుచూడాలి.