• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వివాదాస్పద బిల్లు...

వివాదాస్పద బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం..! అరవింద్​ కేజ్రీవాల్​ ఫైర్​..!

By - Tupaki Desk
Update: 2021-03-25 06:30 GMT
ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా  ఎన్నికైన అరవింద్​ కేజ్రీవాల్​ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వివాదాస్పద బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లు ఏమిటంటే లెఫ్టినెంట్​ గవర్నర్​కు విశేష అధికారాలు కట్టబెట్టడం. అంటే ఇక నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. దాన్ని లెఫ్టినెంట్​ గవర్నర్ ఆమోదించాలి. అప్పుడు ఆ నిర్ణయం కార్యరూపం దాల్చుతుంది. అంటే ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రికి అధికారాలకు కోత పెట్టడమే. నిజానికి కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్ట్​నెంట్​ గవర్నర్​ ఉంటారు. మామూలు గవర్నర్ల కంటే లెఫ్టినెంట్ గవర్నర్లకు విశేష అధికారాలు ఉంటాయి.

అయితే ఢిల్లీకి కూడా గతంలో లెఫ్టినెంట్​ గవర్నర్​ ఉండేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి పూర్తిస్థాయి అధికారాలు కట్టబెడుతూ మామూలు రాష్ట్రంగా చేసింది. కానీ ప్రస్తుతం మళ్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు అధికారాలు కట్టబెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్​సభలో ఆమోదం పొందగా..రాజ్యసభలోనూ నిన్న ఆమోదం పొందింది. ప్రతి పక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం దక్కింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈ బిల్లు కార్యరూపం దాల్చుతున్నది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని నిర్వచించే ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లు -2021’ మార్చి 22న లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం పొందితే ఇక ఢిల్లీ సీఎం అధికారాలకు కోత పడనున్నది. ఈ బిల్లును సెలెక్ట్​ కమిటీకి పంపించాలంటూ విపక్షాలు డిమాండ్​ చేశాయి. మరోవైపు కాంగ్రెస్‌ బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్ఆర్సీపీ సహా పలు విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి.
ఈ బిల్లును ఆమ్​ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది.

‘మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం.. నేడు ప్రజాస్వామ్యానికి జరిగింది’ అంటూ ఆ పార్టీ నేత సంజయ్​ సింగ్​ విమర్శించారు. పేదలకు ఉచితంగా మంచి విద్య నందించడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ ఇవ్వడం, మొహల్లా క్లినిక్​లు ఏర్పాటు చేయడం తాము చేసిన తప్పా అంటూ ఆయన నిలదీశారు.  

అరవింద్​ కేజ్రీవాల్​ ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ‘ ప్రజాస్వామ్యానికి ఇది దుర్ధినం. అయినప్పటికీ మాకు ప్రజల మద్దతు ఉంది. మా రాజీలేని పోరాటాలు కొనసాగిస్తాం’ అంటూ ఆయన ట్వీట్​ చేశారు.
Tags:    
  • Arvind Kejriwal 
  • Arvind Kejriwal comments 
  • Arvind Kejriwal fire 
  • Controversial bill 
  • Rajya Sabha 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS