బీజేపీకి వ్యతిరేకంగా దుమ్ములేపుతున్న కంటెంట్ సర్కిల్స్ లో..!

Update: 2021-04-01 07:48 GMT
సృజనాత్మకథ అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.. ఓ పదేళ్ల కిందటి వరకు మీడియాలో, పత్రికల్లో వచ్చిందే వార్త.. వారు రాసిందే రాత.. జర్నలిస్టులు, వాటి యాజమాన్యాలకు ఏ పార్టీపై ప్రేమ ఉంటే.. ఆ పార్టీ తరుఫున వకాల్తా పుచ్చుకొని రాసేవారు. తమ భావాలను పాఠకులపై రుద్దేవారు. పాఠకుల్లో టీచర్లు, విద్యార్థులు, భావోద్వేగంతో ఉడికిపోయే యువత ఉన్నా.. వారికి నాడు వాయిస్ ఉండేది కాదు.

కానీ నేడు సోషల్ మీడియా అందరికీ ఆయుధం అయ్యింది. ఈ ఆయుధంతోనే గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ లబ్ధి పొంది ఏకంగా ప్రధాని అయ్యాడు. ‘చాయ్ వాలా’ ప్రధాని కాకూడదా? బీసీ ప్రధాని అయితే అందరి కష్టాలు తీరుస్తాడని నమ్మి జనం ఓట్లేసి గెలిపించారు.కానీ గద్దెనెక్కాక మోడీ సార్ పాలన తీరు చూసి అప్పుడు పూలు వేసిన వారే ఇప్పుడు రాళ్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో మోడీ సర్కార్ విధానాలను కడిగిపారేస్తున్నారు.

ఒకటి కాదు.. రెండు కాదు.. మోడీ ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో నెటిజన్లు కడిగేస్తున్నారు. తాజాగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అందులోంచి ఒక పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది..

‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విశాఖఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నందుకు, రైల్వేజోన్ ఇవ్వనందుకు, విభజనహామీలు అమలు చెయ్యనందుకు, పెట్రోల్ సెంచరీ దగ్గరగా ఉన్నందుకు, వంట నూనెల ధరలు డబుల్ సెంచరీ దగ్గరగా ఉన్నందుకు, గ్యాస్ సిలిండర్ సెంచరీ దగ్గరగా ఉన్నందుకు, దాదాపుగా 20 లక్షలమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకి, విశ్రాంత ఉద్యోగులకు 18 నెలలుగా డీఏ బంద్ చేసినందుకు, ఇచ్చిన హామీలు అమలు చెయ్యనందుకు, ఎల్.ఐసీ, రైల్వే, ఎయిర్ పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నందుకు, కులాలమధ్య ఘర్షణలు రేపుతున్నందుకు.. ’ మోడీ సర్కార్ ను ఓడించాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు.

తిరుపతి, ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు ఈ ధరాఘాతంతో సృజనాత్మకతను జోడించి మోడీ సర్కార్ దుమ్ముదులిపేస్తున్నారనుకో.. 
Tags:    

Similar News