• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.....

కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.. డ్యామేజ్ కంట్రోల్!

By - Tupaki Desk
Update: 2019-04-28 14:30 GMT
'మోడీ మీద ప్రియాంక ఎందుకు పోటీ చేయలేదు?' అనే అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోలింగ్ మొదలుపెట్టింది. మామూలుగా అయితే ఇది చర్చే కాదు. మోడీ మీద కాంగ్రెస్ వాళ్లు ఎవరో ఒకరిని పోటీ పెడితే - ఆ అంశం మీద చర్చించుకోవడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఈ వ్యవహారాన్ని ముందుగా కెలికింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే!

స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ ఈ అంశం మీద కెలుకుడు మొదలుపెట్టింది. తామేదో ఘన కార్యం చేస్తున్నట్టుగా మోడీని - బీజేపీని బెదరగొడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు కలరింగ్ ఇచ్చారు. అయితే చివరకు వారే వెనక్కు  తగ్గారు. ఇప్పుడు ఎదురుప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకోవడానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్లు.

తను  మోడీ మీద పోటీ చేయడానికి  రెడీగా ఉన్నట్టుగా ప్రకటించి ప్రియాంక వాద్రా ఈ అంశంపై చర్చకు తెరలేపింది. మోడీ మీద ప్రియాంక పోటీ చేయడం అంటే అది సంచలన అంశమే. ఆ అంశం గురించి ఎవరో అనామకులు మాట్లాడి ఉంటే అదో ముచ్చట. దానిపై స్వయంగా ప్రియాంక మాట్లాడారు - రాహుల్ గాంధీ మాట్లాడారు!

మోడీ మీద ప్రియాంక పోటీకి సై అన్నారు - రాహుల్ ఏమో సస్పెన్స్ అన్నారు. చివరికేమో తుస్ మన్నారు. మోడీ మీద ప్రియాంక పోటీ చేయడం లేదన్నారు. ఇదే అదునుగా బీజేపీ వాళ్లు ఎద్దేవా మొదలుపెట్టారు. మీడియాలో కూడా ప్రియాంక ఎందుకు వెనక్కు తగ్గిందనే అంశంపై విశ్లేషణలు మొదలుపెట్టింది.

ఎన్నికల వేళ ఇలాంటి సెల్ఫ్ గోల్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నిస్తోంది. ప్రియాంక పోటీ చేయకపోవడం ఆమె వ్యక్తిగత నిర్ణయమని ఒక కాంగ్రెస్ నేత ప్రకటించేశారు. తాజాగా ప్రియాంక స్పందిస్తూ తను పోటీ  చేయకపోవడం పార్టీ నిర్ణయం అన్నారు. పార్టీ తనకు వేరే బాధ్యతలు అప్పగించిందని అందుకే తను మోడీ మీద పోటీకి దిగలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు!

ఇదీ కథ. రెండు రకాల సమాధానాలతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎంతగా పాట్లు పడుతుందో అందరికీ అర్థం అవుతోంది!



Tags:    
  • Congress Party 
  • Priyanka Gandhi 
  • Modi 

Similar News

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS