బీహార్ ఎన్నికల్లో సుడి అంటే కాంగ్రెస్ దే
వరుస పరాజయాలతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా చేశాయి బీహార్ ఎన్నికల ఫలితాలు. నిజానికి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర చాలా పరిమితం. అయినప్పటికీ.. ఆ పార్టీకి లభించిన సీట్లు చూస్తే కాస్తంత ఆశ్చర్యం కలగటం ఖాయం. ఎందుకంటే.. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లో లౌకిక మహా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ తనకున్న పరిమితు కారణంగా కేవలం 41 స్థానాల్లోనే పోటీ చేసింది. అయితే.. అనూహ్యంగా ఆ పార్టీ 27 స్థానాల్లో విజయం సాధించింది.
అంటే.. పోటీ చేసిన స్థానాలు.. విజయం సాధించిన స్థానాలు చూస్తే.. ఇంచుమించు 60శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసింది తక్కువ స్థానాలు అయినా.. విజయం సాధించటం ఎక్కువగా ఉండటం విశేషం. నిజానికి బీహార్ లో కాంగ్రెస్ ఉనికి చాలా పరిమితం. మహా కూటమిలో కానీ ఆ పార్టీ భాగస్వామి కాకుండా ఉంటే.. పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది.
అయితే.. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీని దెబ్బ తీసేందుకు.. భేషజాలకు పోకుండా.. బుద్దిగా ఉంటూ మహాకూటమిలో భాగస్వామి కావటమే కాదు.. వారు ఇచ్చిన సీట్లలోనే పోటీ చేసి భారీ విజయాన్ని సాధించి.. కూటమిలో తానూ తీసిపోని రాజకీయ పక్షంగా అవతరించింది. అధికారం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ కు బీహార్ రాజకీయం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పాలి. అందుకే.. మహాకూటమి సర్కారులో తాము భాగస్వామి అయ్యేందుకు సిద్ధం అవుతోంది.
ముందుచూపుతో వ్యవహరించిన దానికి కాంగ్రెస్ కు చక్కటి ప్రయోజనమే లభించిందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. మహాకూటమిలో భాగస్వామి కావాలన్న సోనియమ్మ నిర్ణయం తెలివైనదిగా పలువురు అభివర్ణిస్తున్నారు. నితీశ్ సర్కారులో భాగస్వామి కావటం ద్వారా.. తాము అధికారం ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఒకటిగా చేసుకుంది. పరాజయాల బాటలో ఉన్న కాంగ్రెస్ ఇంతకు మించి కావాల్సిందేముంది.