పార్ల‌మెంట్ లో ఫిజిక‌ల్ ట‌చ్? ఫిర్యాదు చేసిన మ‌హిళా ఎంపీ!

Update: 2020-03-03 11:39 GMT
భార‌త దేశ పార్ల‌మెంట్ లో ఒక మ‌హిళా ఎంపీ త‌ను వేధించ‌బ‌డిన‌ట్టుగా స‌భాధ్యక్షుడికి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారుతూ ఉంది. పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లోనూ సోమ‌వారం తీవ్ర‌మైన అల‌జ‌డి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా స్పందించాయి. అమిత్ షాకు వ్య‌తిరేకంగా ఆయా పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఆ సంద‌ర్భంగా స‌భ‌లో గ‌లాభా చోటు చేసుకుంది. ఎంపీలో తోపులాడుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఈ సంద‌డిలో స‌డేమియా అన్న‌ట్టుగా ఒక మ‌హిళా ఎంపీ మీద అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట ఒక పురుష ఎంపీ. ఈ మేర‌కు ఆమె లోక్ స‌భ స్పీక‌ర్ ఓం ప్ర‌కాష్ బిర్లాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కాంగ్రెస్ ఎంపీ. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన ఆమె పేరు ర‌మ్య‌ హ‌రిదాస్. బీజేపీ ఎంపీ అయిన జస్కూర్ మీనా మీద ఆమె ఫిర్యాదు చేసింది. ఆయ‌న త‌న‌ను ఫిజిక‌ల్ గా ట‌చ్ చేశాడ‌ని, అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆమె రాత పూర్వ‌కంగా ఫిర్యాదు చేసింది!

ఇలా లోక్ స‌భ‌లో ఒక మ‌హిళా ఎంపీ త‌ను చేదు అనుభ‌వాన్ని ఎదుర్కొన్న‌ట్టుగా స్పీక‌ర్ కు ఫిర్యాదు చేసే ప‌రిస్థితి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ విష‌యంలో స్పీక‌ర్ ఏం చ‌ర్య‌లు తీసుకుంటార‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఒక‌వైపు దేశంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం లోక్ స‌భ చ‌ట్టాలు చేస్తూ ఉంటుంది. అలాంటి చోటే ఇలాంటి ఫిర్యాదు చోటు చేసుకున్న‌ట్టుగా ఉంది. ఈ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత‌ల నుంచి ఆడ‌వాళ్ల‌ను ర‌క్షించుకోవాల్సి వ‌స్తోంద‌ని, లోక్ స‌భ‌లోనూ అలాంటి ప‌రిస్థితే ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. త‌ను ద‌ళితురాలిని కావ‌డం వ‌ల్ల‌నే త‌న‌పై అనుచితంగా ప్ర‌వ‌ర్తించారా? అంటూ స‌ద‌రు కాంగ్రెస్ మ‌హిళా ఎంపీ కూడా వ్యాఖ్యానించిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News