ఈడీ ముందు 55 గంటలు కూర్చున్నా.. ఏం చేశారు? : మోడీపై రాహుల్ ఫైర్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషం పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని మండిపడ్డారు. ధరల పెరుగుదల దేశాన్ని నిండా ముంచేస్తోందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం వల్ల సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా డిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ నిరసన కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్.. బీజేపీ వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు మాత్రమే లాభపడుతున్నారని విమర్శలు గుప్పించారు. తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్బంధించి.. ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడిన ఆయన.. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లి నిజాలు చెబుతామని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేషం పెరగడం.. వల్ల దేశం బలహీనంగా మారుతోందన్నారు. దేశంలో భయం, విద్వేషం నెలకొనడం వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారని, వారి ప్రయోజనాల కోసమే బీజేపీ పనిచేస్తోందని విమర్శలు గుప్పించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు కూడా రైతుల కోసం కాదని, ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కల్పించేందుకేనని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
పార్లమెంట్లో విపక్షాల గొంతుకను మోడీ అణచివేస్తున్నారని అన్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. ఇలా అన్ని వ్యవస్థలపైనా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని చెప్పారు. మోడీని ఎవరు విమర్శించినా విడిచిపెట్టడం లేదని, తనను కూడా ఈడీ ముందు 55 గంటలు కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. మోడీజీ.. మీ ఈడీకి నేను భయపడను అని రాహుల్ పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండు సోదరుల్లాంటివని ఎద్దేవా చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఈ ర్యాలీని నిర్వహించడం లేదని అన్నారు. ప్రభుత్వం ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లను ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోడీ ప్రభుత్వానికి సందేశం ఇవ్వనున్నామని తెలిపారు.