కాంగ్రెస్ - బీజేపీ ఆస్తులు... అప్పుల లెక్క ఇదే
భారతదేశంలోనే అత్యంత ధనిక పార్టీ ఏది అన్న ప్రశ్నకు ప్రతి ఒక్కరూ చెప్పే ఆన్సర్ బిజెపి. 2014 నుంచి వివిధ కార్పొరేట్ సంస్థలతో పాటు ఎంతోమంది వ్యాపారస్తులు బిజెపికి అధికారికంగాను... అనధికారికంగా భారీగా విరాళాలు ఇస్తున్న మాట నిజం. 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో అంత కార్పొరేట్ కల్చర్ ఉండేది కాదు.. ఎప్పుడైతే మోడీ ప్రధాన మంత్రి అయ్యారో అప్పటినుంచి బిజెపిలో కార్పొరేట్ కల్చర్ ఎక్కువ అవుతూ వచ్చింది. అదే క్రమంలో కోట్లాది రూపాయల విరాళాలు కూడా ఆ పార్టీ ఖాతాలో పడుతున్నాయి.
కొన్ని దశాబ్దాల క్రితం చూసుకుంటే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అత్యంత ధనిక పార్టీగా ఉండేది. కాంగ్రెస్ కు దరిదాపుల్లో కూడా ఏ పార్టీ ఉండేది కాదు. ఇక తాజాగా ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్ సంస్థ రాజకీయ పార్టీల ఆస్తులు - అప్పుల లెక్కలను ప్రకటించింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ఆస్తులు అమాంతం పెరగగా... రెండోసారి అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఆస్తులు బాగా క్షీణించిపోయాయి.
బీజేపీ ఆస్తులు 2017-18లో 22.27 శాతం పెరిగాయి. 2016-17లో రూ.1,213 కోట్లుగా ఉన్న బీజేపీ ఆస్తులు.. 2017-18 లో రూ.1,483 కోట్లకు ఎగబాకాయి. ఇక కాంగ్రెస్ ఆస్తులు ఇదే కాలానికి రూ.854 కోట్ల నుంచి రూ.724 కోట్లకు పడిపోయాయని తెలిపింది. అంటే 15.26 శాతం క్షీణించాయి. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే ఎన్సీపీ ఆస్తులు రూ.11 కోట్ల నుంచి 9.54 కోట్లకు తగ్గగా.... తృణమూల్ కాంగ్రెస్ ఆస్తులు మాత్రం 26.25 కోట్ల నుంచి 29.10కోట్లకు పెరిగాయని తెలిపింది. బెంగాల్ లో వరుసగా అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఆస్తులు పెరగ్గా... ఎన్సీపీ వరుస ఓటములతో వెనక పడింది.
ఇక పార్టీల ఆస్తులతో పాటు అప్పుల లెక్కను కూడా ఏడీఆర్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ అప్పులు 324.2 కోట్లు ప్రకటించగా.. బీజేపీ అప్పులు 21.38 కోట్లుగా ప్రకటించింది. బీజేపీతో పోలిస్తే ఆస్తుల్లో వెనకపడ్డ కాంగ్రెస్ అప్పుల్లో మాత్రం ముందు ఉంది. ఇక బీజేపీ- కాంగ్రెస్ దరిదాపుల్లో ఏ పార్టీలు కూడా లేవు. ఒకప్పుడు ఆస్తుల్లో మెరుగైన స్థితిలో ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కన్నా వెనకపడిపోయారు.