అయోమయం కూడా కరోనా లక్షణమే!

Update: 2020-11-10 23:30 GMT
ఇప్పటివరకు దగ్గు, జలుబు, జ్వరం మాత్రమే కరోనా లక్షణాలు అనుకున్నాం.. కానీ కొన్ని లక్షణాలు కూడా బయటపడతున్నాయి. అయితే అనవసర విషయాలకు ఆందోళన చెందడం.. అయోమయానికి గురికావడం కూడా కరోనా లక్షణమేనని సైంటిస్టులు చెబతున్నారు. ‘డిలీరియం’ వాస్తవానికీ, భ్రమకూ మధ్య తేడా తెలియని ఈ స్థితిలో ఉన్న వ్యక్తి వాస్తవంతో సంబంధం కోల్పోయి, అయోమయానికి లోనవుతాడు. ఈ లక్షణాన్ని బట్టి, నాడీవ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం గురించి పలు పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలో... హైపోక్సియా, న్యూరోనల్‌ ఆక్సిజన్‌ డెఫిసియన్సీ, మెదడు కణజాలం వాపు (సైటోకైన్‌ స్టార్మ్‌)... ఈ మూడు పరిస్థితులను బట్టి నాడీవ్యవస్థ మీద కరోనా ప్రభావాన్ని పరిశోధకులు అంచనా వేయగలిగారు.

 అయితే కరోనా వైరస్‌ ఈ మూడు స్థితుల ఫలితంగా మెదడు మీద పరోక్ష ప్రభావం చూపించడమే కాకుండా, బ్లడ్‌ బ్రెయిన్‌ అవరోధాన్ని అధిగమించి, నేరుగా మెదడుకే సోకే వీలూ లేకపోలేదని రుజువైంది. కొంతమందిలో సాధారణ లక్షణాలు కనిపించకుండా ఆందోళన చెందడం మాత్రమే ప్రధాన లక్షణంగా కూడా ఉండొచ్చని వైద్యలు చెబుతున్నారు.  ఇలాంటి వారిలో అయోమయం, మానసిక గందరగోళం, ఆలోచించే సామర్ధ్యం కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిద్రపట్టకపోవడం, ఏకాగ్రత లోపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Tags:    

Similar News