టీకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు దిమ్మ తిరిగేలా పంచ్ ఇచ్చిన సామాన్యుడు!
తన మాటలతో రాజకీయ ప్రత్యర్థులకు పంచ్ లు వేసి.. ఉక్కిరిబిక్కిరి చేసే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అందుకు ఒక సామాన్యుడు కారణం కావటం గమనార్హం. మల్కాజిగిరికి దగ్గర్లోని నేరెడ్ మెట్ లోని నాలాలో పడి సుమేధ అనే చిన్నారి పడిపోయి మరణించటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు ఆయన వచ్చారు.
ఈ సందర్భంగా రోడ్డు సమస్యపై రేవంత్ ను నిలదీశాడో సామాన్యుడు. ‘మిమ్మల్ని గెలిపించుకోవటం మా దౌర్భాగ్యం. ఎమ్మెల్యే టీఆర్ఎస్.. ఎంపీ కాంగ్రెస్ కు చెందిన వారు కావటంతో అభివృద్ధి కుంటుపడింది. రోడ్లు సరిగా లేకున్నా ఎమ్మెల్యే పట్టించుకోరు. మీరు చేయరు’’ అంటూ రేవంత్ పై గుస్సా అయ్యారు.
స్థానికంగా రోడ్లు సరిగా లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లుగా వాపోయాడు. తమ సమస్యల్ని.. కష్టాల్ని పట్టించుకునే నాథుడే లేడన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఊహించని పరిణామానికి రేవంత్ షాక్ తిన్నారు. రాజకీయ ప్రత్యర్థులకైతే ఘాటుగా రియాక్టు అయ్యేవారేమో కానీ.. నిలదీసింది సామాన్యుడు కావటంతో మరో మాట మాట్లాడలేదు. అంతేకాదు.. తన పర్యటనను అక్కడితో ఆపేసి వెనక్కి తిరిగి వెళ్లిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితి రేవంత్ కు ఎప్పుడూ ఎదురుకాలేదని చెబుతున్నారు.