మహిళా వాలంటీర్‌పై కమిషనర్ చిందులు.. తోలు తీయిస్తానంటూ.. వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రభుత్వానికి ఇప్పుడు కర్త, కర్మ, క్రియ వంటి వలంటీర్ వ్యవస్థకు ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారో.. అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్నీ.. వలంటీర్ల ద్వారానే దాదాపు నిర్వహిస్తున్ పరిస్థితి. ప్రతి వార్డు, గ్రామాల్లో వలంటీర్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. వీరికి నెలకు ఇచ్చేది రూ.5000 వేలే అయినా.. 50 వేల రూపాయలు తీసుకునేఅ ధికారులు చేసే పనులు కూడా వీరితో చేయిస్తున్నారు.
అయినప్పటికీ.. ఉన్నతాధికారులు కొందరు వలంటీర్లను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నారు. వలంటీర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని.. వారికిఅసలు పనిగంటలు కూడా లేకుండా పోయాయని విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ఈ విమర్శలు వస్తున్నా.. లెక్కచేయకుండా.. గుంటూరుకు చెందిన కమిషనర్ ఓ మహిళా వలంటీర్‌పై నోరు పారేసుకున్నారు. పిల్లలకు భోజనం పెట్టేందుకు వెళ్లాను సార్.. అని నెత్తీనోరూ మొత్తుకున్నా వినకుండా.. నీ తాట తీయిస్తా.. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తా.. అంటూ.. నోటికి ఇష్టం వచ్చి నట్టు మాట్లాడి బెదిరించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా, నరసరావుపేట మహిళా వార్డు వాలెంటీరుపై నరసరావుపేట కమీషనర్ కె.రామచంద్రారెడ్డి చిందులు తొక్కాడు. షేక్ అక్తర్ అనే మహిళ 3వ వార్డులో వాలెంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. అయితే అక్కడి అడ్మిన్ గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమీషనర్ తనకు ఫోనుచేసి అసభ్యంగా మాట్లాడారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేసింది. గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో 3 వార్డు వాలెంటీర్లు అందరూ అడ్మిన్ పై కమీష్నర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని తమను మరిన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తెలియజేశారు. వార్డు అడ్మిన్ చెప్పారని కమీషనర్ తనను ఫోనులో బూతులు మాట్లాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకో మంటూ... బొక్కలో వేసి తోలు వలిపిస్తా.. అంటూ బెదిరిస్తున్నారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యంగా మాట్లాడిన కమీషనర్ రామచంద్రారెడ్డి పై, వార్డు అడ్మిన్ నవ్యలపై చర్యలు తీసుకొవాలని ఆమె వేడుకున్నారు.