• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'కలర్ ఫుల్' నిజాలు.....

'కలర్ ఫుల్' నిజాలు.. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ సామర్థ్యం!

By - Tupaki Desk
Update: 2022-01-29 23:30 GMT
కలర్స్.. ఇవి లేకుంటే ప్రపంచం ఎంత డల్ గా ఉంటుందో కదా. నిజానికి రంగులు అనేవి  మనిషి జీవితానికి చాలా ముఖ్యం. ప్రతీ ఒక్కరూ కలర్ ఫుల్ జీవితం కావాలని కోరుకుంటారు. వివిధ వర్ణాల రకరకాల గుణాలు కలిగి ఉంటాయి. కొన్ని రంగులు శాంతిని కలిగిస్తాయి. మరికొన్ని కోపాన్ని తగ్గిస్తాయి. ఇంకా కొన్ని ఆకలిని పెంచుతాయి. అందుకే కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో ప్రత్యేకమైన కలర్స్ వేస్తారు. అయితే ఈ రంగులు గుర్తించడంలో పురుషుల కంటే మహిళలే సిద్ధహస్తులంటా. రంగుల్లో షేడ్స్ ను మహిళలే చాలా స్పష్టంగా గుర్తించగలుగుతారని అమెరికాకు చెందిన బ్ల్రూక్లిన్  అనే సంస్థ వెల్లడించింది.

మహిళలు, పురుషులు రంగులు గుర్తించే సామర్థ్యంపై బ్ల్రూక్లిన్  సంస్థ అధ్యయనం చేపట్టింది. కాగా మన శరీరంలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ లో కలర్స్ గుర్తించడానికి సహకరిస్తుందని ఆ సంస్థ తేల్చింది. ఈ క్రోమోజోమ్ మహిళల్లో రెండు ఉంటే.. పురుషుల్లో ఒకటి మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల హార్మోన్లు సైతం రంగులను గుర్తించడంలో సాయపడతాయని చెప్పారు. మహిళల్లో ఉండే టెస్టోస్టిరాన్ కూడా వర్ణాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వెల్లడించారు. అందుకే పురుషులతో పోల్చితే... మహిళలే ఎక్కువ రకాల రంగులను, వాటి మధ్య ఉన్న స్వల్ప తేడాలను కూడా గుర్తించగలుగుతామని వివరించారు.

ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే కలర్ బ్లూ అని ఈ ఫలితాల్లో తేలింది. దాదాపు 40 శాతం మందికి ఈ రంగు అంటే ఇష్టమటా.. ఆ తర్వాతి స్థానంలో పర్పుల్ కలర్ ఉంది. ఇకపోతే తర్వాతి స్థానాల్లో ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఆఖరి స్థానాల్లో తెలుపు, ఆరెంజ్, పసుపు రంగులు ఉన్నట్లుగా బ్ల్రూక్లిన్  సంస్థ సర్వేలో వెల్లడైంది. పింక్ కలర్ కు కోపాన్ని, ఆందోళన తగ్గించే గుణం ఉన్నందున వీటిని జైళ్లు, మానసిక చికిత్స ఆస్పత్రుల్లో ఉంచుతారని శాస్త్రవేత్తలు తెలిపారు.

వాహనాలకు సురక్షితమైన రంగు తెలుపు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మంచు తప్ప మిగిలిన ఎటువంటి పరిస్థితుల్లోనైనా తెల్లని వాహనాలను సులభంగా గుర్తించవచ్చు అని అంటున్నారు. దీనితో పోల్చితే పసుపు రంగు ఇంకా స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఆ రంగులో వాహనాల సంఖ్య చాలా తక్కువ. అంతేకాకుండా ఎరువు, పసువు రంగు ఆకలిని పెంచుతాయట. అందుకే ప్రముఖ హోటళ్లు ఆ రంగుల్లో తమ బ్రాండ్లు ఉండేలా డిజైన్ చేసుకుంటారని బ్ల్రూక్లిన్  సంస్థ వెల్లడించింది.

ఈ విధంగా రంగుల ప్రపంచంలో కలర్ ఫుల్ నిజాలు దాగి ఉన్నాయి. ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అందుకే మన ప్రపంచం ఇంత సుందరంగా ఉంది. అయితే ఈ కలర్ ఫుల్ ప్రపంచాన్ని గుర్తించడంలో మహిళలకే ఎక్కువ సామర్థ్యం ఉందని బ్ల్రూక్లిన్  సంస్థ ఫలితాలు చెబుతున్నాయి.


Tags:    
  • Men 
  • women 
  • latestfacts 
  • colours 
  • chromosomes 
  • latestnews 
  • tupakiupdates 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS