అందుకే గాంధీలో కేసీఆర్ ఎన్95 మాస్కు పెట్టుకున్నారట
గాంధీ ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెళ్లటం.. అక్కడ చికిత్స పొందుతున్నరోగులకు అత్యంత దగ్గరగా వెళ్లి.. వారికి ధైర్యం చెప్పటమేకాదు.. నేను మీకున్నానన్న భరోసాను కలిగించటం తెలిసిందే. గాంధీలో.. అందునా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు చికిత్స అందించే ఐసీయూకు వెళ్లిన ముఖ్యమంత్రి.. ముఖానికి ఎన్95 మాస్కు తప్పించి మరింకేమీ పెట్టుకోవటం తెలిసిందే.
సాధారణంగా ఐసీయూ వార్డు అన్నంతనే పీపీఈ కిట్ ధరిస్తారు. సకల జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది సీఎం కేసీఆర్ మాత్రం చేతులకు గ్లౌజులు కూడా వేసుకోకుండా.. ముఖానికి ఎన్95 మాస్కుకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు? ఆయనకు అవసరమైన రక్షణ సాధనాల్ని సిద్ధం చేయలేదా? అన్న సందేహం రాక మానదు. గాంధీ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
గాంధీ ఆసుపత్రికి కేసీఆర్ వస్తున్నట్లుగా సమాచారం అందిన వెంటనే.. పీపీఈ కిట్లతో పాటు.. ముఖం మొత్తాన్ని కవర్ చేసే షీల్డులు.. కళ్లజోడులు.. ఇలా అన్ని రక్షణ సామాగ్రిని సిద్ధం చేశారు. గాంధీకి చేరుకున్న కేసీఆర్ ను.. వాటిని ధరించాల్సిందిగా అక్కడి సిబ్బంది కోరారు. మీరు వార్డుల్లో తిరిగేటప్పుడు ఎలా తిరుగుతారు? అని వారిని కేసీఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తాము ముఖానికి ఎన్ 95 మాస్కులు పెట్టుకొని తిరుగుతామని చెప్పినట్లుగా సమాచారం.
దీంతో స్పందించిన కేసీఆర్.. ‘‘మీరు ఎలా అయితే మాస్కు పెట్టుకొని తిరుగుతారో.. నేను అలానే తిరుగుతాను’’ అంటూ బదులివ్వటమే కాదు.. ముఖానికి ఎన్ 95 మాస్కు మినహా మరింకేమీ పెట్టుకోకుండా వార్డుల్లో తిరిగారు. గాంధీ వైద్యులు సైతం విస్మయానికి గురయ్యేలా.. పేషెంట్లకు అత్యంత సమీపానికి వెళ్లి.. వారు చెప్పేది శ్రద్ధగా విన్న వైనం చర్చనీయాంశంగా మారింది.