మోడీ సర్కారు వారి రైల్వే యూజర్ ఛార్జీలు ఎంతంటే?
విమాన ప్రయాణం చేసే వారు.. వారి టికెట్లలో యూజర్ ఛార్జీల పేరుతో కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటారు. దీనికి కారణం ఆయా విమానాశ్రయాల్లో కల్పించే సౌకర్యాలుగా చెబుతుంటారు. దేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. వాటి ద్వారా ప్రయాణించే ప్రయాణికుల నెత్తిన యూజర్ ఛార్జీల భారం మోపే సరికొత్త విధానానికి కేంద్రంలోని మోడీ సర్కారు తెర తీయటం తెలిసిందే.
సంచలనంగా మారిన ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. సామాన్యుడు ప్రయాణించే రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కల్పన పేరుతోయూజర్ ఛార్జీల్ని వసూలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ యూజర్ ఛార్జీలు ఎలా ఉండనున్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకాలం క్లారిటీ లేని ఈ ప్రశ్నకు తాజాగా స్పష్టత వచ్చేసింది.
ట్రైన్లో ప్రయాణించే తరగతి టికెట్ ఆధారంగా యూజర్ ఛార్జీల్ని వసూలు చేస్తారని చెబుతున్నారు. ఇవి కనిష్ఠంగా రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.35 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుల మీద అత్యధికంగా ఒక్కొక్కరి మీద రూ.35 చొప్పున వసూలు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
వీటిల్లో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం దేశంలోని మొత్తం రైల్వే స్టేషన్లలో యూజర్ ఛార్జీల గొడుగు కిందుకు 700 నుంచి వెయ్యి రైల్వే స్టేషన్లను తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు. ఇలా ప్రయాణికుల నుంచి వసూలు చేసే సొమ్ముల్ని రైల్వే స్టేషన్ల డెవలప్ మెంట్ కు ఉపయోగిస్తామని చెబుతున్నారు. అందుకు.. ప్రజల మీద భారం మోపాల్సిందేనా? అన్నది ప్రశ్న.