• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విశాఖ తీరంలో చైనా షిప్...

విశాఖ తీరంలో చైనా షిప్ ... కరోనా భయంతో ఆపేసిన అధికారులు !

By - Tupaki Desk
Update: 2020-03-06 07:45 GMT
విశాఖ తీరంలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపుతోంది. కరోనా వైరస్ పుట్టిన గడ్డ చైనా దేశం నుంచి ఏపీలోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఫార్చూన్‌ హీరో షిప్‌ రావటంతో అధికారులు కలవరం చెందారు. చైనాలో కరోనా సృష్టిస్తున్న అలజడికి జడిసి విశాఖ అధికారులు ఆ ఫార్చూన్‌ హీరో షిప్‌ పోర్ట్‌కి రావడానికి అధికారులు అనుమతి నిరాకరించారు.పారాదీప్ పోర్టు అనుమతి నిరాకరించడం తో విశాఖకు వచ్చిన ఈ షిప్‌లో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది చైనీయులు, ముగ్గురు మయన్మార్ వాసులు ఉన్నారు. వీరికి కరోనా సోకిందన్న అనుమానంతో తీరానికి రావొద్దని ఆంక్షలు విధించారు.

నావికుల ఆరోగ్యపరిస్థితిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శుక్రవారం వీరికి వైద్యపరీక్షలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ముందు జాగ్రత్తగా ఈ షిప్‌ను వెనక్కు తిప్పి పంపాలనే పోర్ట్ వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన షిప్ అంటే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపైనా స్పష్టత లేకపోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు. కరోనా పేరెత్తితేనే ఏపీ, తెలంగాణల్లో బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది ఏకంగా చైనా నుంచి వచ్చిన షిప్ అంటే సహజంగానే మరింత కంగారు ఉంటుంది. పైగా షిప్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి పైనా స్పష్టత లేక పోవడంతో పోర్ట్‌కి రావడానికి అనుమతివ్వలేదు.

ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. చైనాలో ఇప్పటికే 3వేలకు పైగా మృతి చెందినట్లు అధికారికంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో 139 మంది వైరస్ బారిన పడినట్లు ధ్రువీకరించారు. అయితే చైనాలో కరోనా క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం గా ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది హుబే ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు.
Tags:    
  • Chinese ship reaches Visakha port 
  • Corona Virus In Vizag 
  • Corona in China 
  • Corona Virus in China 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS