అమ్మాయిల‌ బ‌ట్ట‌లిప్పి కొట్టేశారు..

Update: 2016-01-19 15:56 GMT
ఆడ‌పిల్ల‌ల‌కు ఎలాంటి అవ‌మానాలు - ఆకృత్యాలు ఎదురైనా వెంట‌నే అబ్బాయిల‌పై ఫిర్యాదులు వ‌చ్చి ప‌డుతుంటాయి. మొగాళ్లంతా రాక్ష‌సుల‌ని...మ‌నసున్న వారు కాదని మండిప‌డుతుంటారు. అమ్మాయిల‌కు అండ‌గా నిలుస్తుంటారు. అయితే ఈ వార్త చ‌దివితే అమ్మాయిలే అమ్మాయిల‌కు శ‌త్రువుల‌ని అంగీక‌రిస్తారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే ఓ రాక్షస టీనేజ్ అమ్మాయిల బృందం స్కూలు బాలిక‌పై అరాచ‌కానికి పాల్ప‌డింది. యూనిఫాంలో ఉన్న  విద్యార్థి అని కూడా చూడ‌కుండా....ఆమెను వివ‌స్త్రను చేసి చిత‌క్కొట్టారు.

చైనాలో హయినన్ ప్రావిన్స్ లోని లింగావోలో ఈ రాక్ష‌స కృత్యం జరిగింది. యూనిఫాంలో ఉన్న ఓ బాలికను టీనేజ్ అమ్మాయిలు అడ్డ‌గించారు. ఆ బాలిక జుట్టు పట్టుకుని లాగుతూ.. కాళ్లతో తన్నుతూ చిత‌క‌బాదారు. అంతటితోనే వారి పైశాచిక‌త్వం ఆగిపోలేదు. అందరూ చూస్తుండగానే బట్టలు విప్పి మరీ చితక్కొట్టారు. కానీ క‌ష్టం మీద త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న ఆమెను వెంటాడి మ‌రీ దాడి చేశారు.

ఈ టీనేజ్ అమ్మాయిల గ్రూప్ రెచ్చిపోవ‌డ‌మే షాక్ అనుకుంటే...ఈ అరాచ‌క‌త్వం జ‌రిగే స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కొంద‌రు అమ్మాయిలు త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్లు ఉండిపోయారు. పైపెచ్చు ఈ రాక్ష‌స‌త్వాన్ని అంతా వీడియో తీసి ఇంట‌ర్నెట్ లో పెట్టారు. దీంతో చైనాలో టీనేజర్ ల ఆగడాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్ప‌టికే ఈ అరాచ‌క‌ సంఘటనతో చైనాలో టీనేజ్ గ్రూపుల ఆకృత్యాలు మరో సారి బయటకు వచ్చినట్టయింది. పోలీసులు ఈ సంఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తుండ‌గా...ప్ర‌భుత్వం ఈ ప‌రిణామాన్ని సీరియ‌స్‌గా తీసుకొని ప‌రిణామాల‌పై ఆరాతీస్తోంది.
Tags:    

Similar News