చైనా వ్యాక్సిన్ ధర మరీ అంతనా!

Update: 2020-08-22 03:45 GMT
గత ఏడాది నవంబర్ లో చైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ఆ తర్వాత  ప్రపంచం అంతటా విస్తరించింది. వైరస్ కి అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు ముమ్మరంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.  చైనా, రష్యా, అమెరికా, భారత్  టీకా తయారీ లో ముందంజ లో ఉన్నాయి. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధం చేసి ఉత్పత్తి మొదలు పెట్టె ప్రక్రియ లో ఉంది. ప్రపంచంలో ఏ దేశం ముందు టీకా కనిపెట్టినా వారి వద్ద కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే  ప్రపంచ జనాభా లో 25 శాతం మంది వైరస్ బారిన పడటంతో అందరికీ చవక ధరల్లో వ్యాక్సిన్ అందించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో చైనా ప్రత్యేకంగా వ్యవహరిస్తోంది. తాము ఉత్పత్తి చేసే టీకా ధర రెండు డోసులు రూ. 10 వేలకు పైగానే ఉంటుందని ప్రకటించింది. డ్రాగన్ కంట్రీ ధరలపై మరీ ఇంత  ధరనా అని ఇతర దేశాలు  నోరెళ్ళ బెడుతున్నాయి.

చైనాలోని సినోఫార్మా కంపెనీ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. తాము సిద్ధం చేసే టీకా ధర రెండు డోసులు 10, 800  వరకు ఉండొచ్చని ఆ కంపెనీ చైర్మన్ జింగ్ జాన్ ప్రకటించారు. అమెరికా కంపెనీ మోడెర్నా కూడా వ్యాక్సిన్ రేస్ లో ముందుంది. ఈ కంపెనీ తమ వ్యాక్సిన్ ధర రెండు డోసుల ధర రూ. 2800గా ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీలో ముందుగా.. అందరూ నమ్మకం పెట్టుకున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ధర మాత్రం కాస్త చవక ధరల్లోనే ఉంది. రెండు డోసుల ధర రూ. 600 వరకు ఉండొచ్చని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ పూర్తయిందని ప్రకటించిన రష్యా మాత్రం ధర ప్రకటించకుండా గుంభనంగా వ్యవహరిస్తోంది. భారత్ లో టీకా తయారీలో   మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న బయోటెక్ మాత్రం అత్యంత చవకైన ధరలకే మందు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ ఎండీ కృష్ణ ప్రకటించారు కూడా.  అందుకే చాలా దేశాలు మన దేశ టీకా కోసం ఎదురు చూస్తున్నాయి.
Tags:    

Similar News