సింగిల్స్ డే.. అదరగొట్టేసిన ఆలీబాబా

Update: 2020-11-12 07:10 GMT
కరోనా దెబ్బకు అతలాకుతలమైన దేశాల్లో చైనా ఒకటి. వైరస్ ను విజయవంతంగా నిలువరించిన ఆ దేశం.. ప్రపంచ వ్యాప్తంగా ఆరాచకం చేసిన వైరస్ కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటివేళ.. ప్రఖ్యాత ఆన్ లైన్ వ్యాపార దిగ్గజం ఆలీబాబా నిర్వహించిన సింగిల్స్ డే అమ్మకాలు.. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని చెబుతున్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడిందన్న సంకేతాల్ని ఇచ్చేలా అమ్మకాలు సాగినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో భారీ స్థాయిలో అమ్మకాలు సాగటం ఆనందానికి గురి చేస్తోంది. సింగిల్స్ డే లో భాగంగా ఈ నెల (నవంబరు 1 - 11) లో నిర్వహించే సింగిల్స్ డే లో ఇప్పటివరకు 498 బిలియన్ యువాన్లకు పైగా అమ్మకాల్ని నమోదు చేసినట్లుగా పేర్కొంది.

నవంబరు 11న ఒక్కరోజే గత సంవత్సర రికార్డు 38.4 బిలియన్ డాలర్ల అమ్మకాల్ని దాటేసినట్లు పేర్కొంది. అలీబాబాతో పాటు.. మరో రిటైల్ వ్యాపార సంస్థ సైతం షాపింగ్ బొనాంజాలో 271.5 బిలియన్ యువాన్ల అమ్మకాల్ని నమోదు చేసింది. ఈ గణాంకాలు చైనా ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా ఉన్నాయన్న సంకేతాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News