ప్రపంచానికి మరో ముప్పు తెస్తున్న చైనా..
ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా చైనా నుంచే పుట్టిందని అందరికీ తెలుసు. అయితే బయటికొచ్చిందన్న విషయం అక్కడి ప్రభుత్వం వెల్లడించడం లేదు. కానీ ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ మాత్రం పట్టి ఇప్పటికీ పీడిస్తోంది. చాలా దేశాలో వైరస్ తో బాధపడడానికి చైనానే కారణమని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చైనా దేశం ప్రపంచానికి మరో షాక్ ఇచ్చింది. మత దేశంలో విద్యుత్ కొరత కారణంగా కరెంట్ కోతలను తీవ్రతరం చేసింది. దీంతో చాలా పరిశ్రమల్లో వస్తువుల ఉత్పత్తికి అంతరాయంగా మారుతోంది. దీంతో చైనా వస్తువులపై ఆధారపడ్డ కొన్ని దేశాలు ఆ దేశం నుంచి వస్తువులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచంలోని చాలా దేశాలు చైనా వస్తువులపై ఆధారపడి ఉన్నాయి. తక్కువ ధరకే రకరకాల వస్తువులను చైనా అందించడంతో వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలు సైతం తక్కువ ధరకే విలువైన వస్తువులు రావడంతో వీటిపై మక్కువ పెంచుకున్నారు. మొన్నటి వరకు ఆయా దేశాలకు అనుగుణంగా చైనా వస్తువులను ఎగుమతి చేసింది. అయితే తాజాగా అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఇతర దేశాలకు వస్తువుల ఎగుమతిలో పరిమితి విధించింది. ఎందుకంటే దేశంలో ప్రస్తుతం కరెంట్ సంక్షోభం కారణంగా విద్యుత్ ను పరిమితంగా వాడాలని సూచిస్తోంది. దీంతో కరెంట్ కోతలను తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో చాలా పరిశ్రమలు వస్తువుల ఉత్పత్తిని నిలిపివేశాయి.
కరెంట్ కోతల కారణంగా ఆ దేశంలోని పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ అనుసరిస్తున్న పరిమిత విధానంతో ఈశాన్య చైనాలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. గడిచిన వారం రోజుల్లో చాలా ప్రావిన్సుల్లోని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. యంత్రాలు మూలన పడ్డాయి. మిగతా వాటిలో పాక్షకింగా ఉత్పత్తి జరుగుతోంది. మరికొంత కాలం ఈ విద్యుత్ కోతలు తప్పవని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారరు. చైనాలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ ప్రభావం పలు దేశాలపై పడింది. అమెరికా, భారత్ లోనూ చాలా కంపెనీలకు చైనా ముడి సరుకులను పంపిణీ చేస్తోంది. విద్యుత్ కోతల కారణంగా వాటి సరఫరా నిలిచిపోయింది.
అంతర్జాతీయ బ్యాంకిగ్ సెక్టార్ కు చెందిన గోల్డ్ మన్ శాక్స్ ఈ ఏడాది చైనా వృద్ధి రేటు 8.2 శాతం నుంచి 7.8 శాతం అంచనా వేశారు. జూలై- సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి అంచానాను 5.1 శాతం నుంచి 4.8 శాతం, అక్టోబర్ - డిసెంబర్ వృద్ధి 4.1 శాతం నుంచి 3. 2 శాతానికి కుదించారు. చైనాలో కరెంట్ కోతలు ఇలాగే ఉంటే అంతర్జాతీయంగా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు. చైనా వస్తువుల సరఫరా నిలిచిపోవడంతో వస్తువుల ధరలు పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే చైనా సహా ప్రపంచ జీడీపీ వృద్ధిపైనా ఈ ప్రభావం ఉంటుదని అంటున్నారు.
చైనాల విద్యుత్ కోతలకు కారరణమేంటి..? ప్రభుత్వం విద్యుత్ సరఫరాను ఎందుకు పరిమితం చేస్తుంది..? అంటే సాధారణంగా చైనాలో శీతాకాంలో విద్యుత్ కోతలు అధికంగా ఉంటాయి. కానీ ఈసారి ముందుగానే ప్రభుత్వం విద్యుత్ సరఫరాను పరిమితం చేసింది. గతంలో చైనా , ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేది. కానీ కరోనా సంక్షోభం నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ పై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. దీంతో గేతేడాది ద్వితీయార్థం నుంచే ఆస్ట్రేలియా బొగ్గు సరఫరాను నిలిపివేసింది. చైనాలో బొగ్గు ఆధారిత ప్లాంట్ల నుంచే 57 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో బొగ్గు కొరత కారణంగా అక్కడి ప్రభుత్వం కరెంట్ కోతలను విధిస్తోంది.