వీర్యం కోసం డ్రాగన్ దేశంలో ఎంత డిమాండ్ అంటే..?

Update: 2016-06-15 04:46 GMT
డ్రాగన్ దేశంలో ఇప్పుడో పెద్ద కొరత వచ్చి పడింది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా చైనాలో వీర్యం కొరత వచ్చి పడింది. ఇదేం కొరత అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరు చదివింది నిజమే. అయినా.. వీర్యానికి కూడా కొరత వస్తుందా? అన్న డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడి పరిస్థితి అలాంటిది మరి. ఎందుకంటే.. దశాబ్దాల తరబడి చైనాలో ఒక్క సంతానాన్ని కనేందుకు మాత్రమే అనుమతి ఉంది.

ఇటీవల రెండో సంతానాన్ని కనేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో.. వయసులో పెద్దవారు వీర్యదానం ఇచ్చే బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ఉన్నట్లుండి వచ్చి పడిన డిమాండ్ కు తగినట్లుగా వీర్య బ్యాంకులు వీర్యాన్ని సేకరించి ఉంచలేదు. దీంతో.. వీర్యం కోసం డిమాండ్ భారీగా ఏర్పడింది. ఈ కొరతను తీర్చుకునేందుకు ఇప్పుడు వీర్యం బ్యాంకులు భారీ ఆఫర్లే ప్రకటిస్తున్నాయి.

వీర్యాన్ని దానం ఇచ్చే వారికి ఐ ఫోన్ ఉచితంగా ఇవ్వటంతో పాటు.. దాదాపు రూ.7వేల మొత్తాన్ని కూడా ఇచ్చేందు సిద్ధమవుతున్నారు. డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. బ్యానర్లు కట్టి మరీ వీర్యాన్ని దానం చేసే వారికి వెయిట్ చేస్తున్నాయట. మరి.. ఊరించే బహుమతులు చైనా యువకుల్ని ఎంతమేరకు ఆకర్షిస్తాయో..?
Tags:    

Similar News