10వేల మంది భారతీయ ప్రముఖల డేటాపై చైనా కన్ను !
నోటితో పొగిడి నొసటితో వెక్కిరించడం చైనాకు బాగా అలవాటు. ఒకవైపు శాంతియుత చర్చలు అంటూనే , మరోవైపు దొంగబుద్ధిని చూపిస్తుంది. తాజాగా చైనా మరో కుట్ర పన్నింది. భారతీయ ప్రముఖుల విలువైన డేటా పై డ్రాగన్ కన్నేసింది. సాంకేతిక యుద్ధానికి తెరలేపింది. ఓ వైపు ఇరుదేశాల సరిహద్దుల నడుమ ఉద్రిక్త పరిస్ధితులు ఉన్న తరుణంలోనే దేశం లోని ప్రముఖ నేతలపై రహస్యంగా నిఘా పెట్టి సాంకేతిక యుద్ధానికి తెరతీసింది. దేశంలోని 10వేల మంది ప్రముఖలు, భారత్ కు చెందిన కీలక సంస్థల పై చైనా గూడాచార విభాగం నిఘా పెట్టింది. అందులో ప్రధాని మోడీ , సోనియా కూడా ఉండటం గమనార్హం.
సరిహద్దుల్లో తన కుట్రలు విచ్చిన్నం కావడంతో ఏకంగా దేశ నేతలు, ప్రముఖలపై నిఘా పెట్టింది. చైనా నిఘా నీడలో భారత రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, మాజీ సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఉన్నట్లు జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. జెన్ హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ భారతీయ డేటా ను సేకరిస్తున్నట్టు సమాచారం. వివిధ పద్ధతుల్లో భారత ప్రముఖల డేటాను చైనా హ్యాక్ చేస్తోంది. ప్రముఖులు మాట్లాడుతున్న అంశాలను కూడా గమనిస్తోంది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా క్రిమినల్స్ డేటా సేకరిస్తోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, శాస్త్రవేత్తల పై రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తోంది.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ వారి కుటుంబాల వరకు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ , అశోక్ గెహ్లోట్ అమరీందర్ సింగ్లకు ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, కేబినెట్ మంత్రులు రాజనాథ్ సింగ్ రవిశంకర్ ప్రసాద్ నుండి నిర్మల సీతారామన్ , స్మృతి ఇరానీ, పియూష్ గోయల్ వివరాలను చైనా సేకరించిందని సమాచారం. అలాగే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ సింగ్ రావత్‌తో సహా కనీసం 15 మంది మాజీ ఆర్మీ ఉన్నతాధికారులకు, నేవీ వైమానిక దళం, లోక్పాల్ జస్టిస్ పిసి ఘోస్, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ జిసి ముర్ములకు భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ బొబ్డే, సోదరుడు న్యాయమూర్తి ఎఎమ్ ఖాన్విల్కర్, పారిశ్రామికవేత్తలు రతన్ టాటా గౌతమ్ అదానీలకు వరకు డేటాను డ్రాగన్ సేకరించింది. ఈ అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరుణం లోనే చైనా కుట్ర బయట పడటం కలకలం రేపుతోంది.
చైనా దురాగతాలు, సరిహద్దుల్లో ఆక్రమణలపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇదివరకే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ చైనా తీరు మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రముఖుల డేటాపై నిఘా ఉంచడానికి ప్రత్యేకంగా ఓవర్‌సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ (ఓకేఐడీబీ) ఆ సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. షెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకు చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ ప్రభుత్వంతో నేరుగా సత్ససంబంధాలు ఉన్నట్లు వెల్లడించింది.