అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో కీలక ముందడుగు .. ఆ ప్రయోగం సక్సెస్ !

Update: 2021-06-17 10:53 GMT
అంతరిక్షంలో తమ సత్తా చాటాలని భావిస్తున్న చైనా ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మర చేస్తుంది. ఇప్పటికే స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం తలపెట్టని చైనా మరో కీలక ముందడుగు వేసింది. నిర్మాణంలో ఉన్న స్పేస్‌ స్టేషన్‌ లోకి ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్తున్న అంతరిక్ష నౌకను గురువారం ప్రయోగించింది. ఈ ముగ్గురిని టియాంగాంగ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చి -2 ఎఫ్ రాకెట్‌ ద్వారా స్పేస్‌ స్టేషన్‌ లోకి పంపించారు. అక్కడ వారు మూడు నెలలు గడుపుతారు. చైనా గోబి ఎడారిలో ప్రయోగించిన ఈ రాకెట్‌ గురువారం ఉదయం 9.22 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. చైనా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్న స్పేస్‌ స్టేషన్‌ పూర్తి చేసే క్రమంలో షెన్‌జౌ -12.. 11 మిషన్లలో మూడవది. వీటిలో నాలుగు బృందాలు ఉంటాయి. మూడు మాడ్యూళ్ళలో మొదటిది, అతిపెద్దది అయిన టియాన్హే ప్రారంభించడంతో ఏప్రిల్‌లో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం ప్రారంభమైంది.

వ్యోమగాములు నీ హైషెంగ్, లియు బోమింగ్, టాంగ్ హాంగ్బో, భవిష్యత్ అంతరిక్ష కేంద్ర నివాస గృహమైన టియాన్హేలో మూడు నెలలు పని చేయవలసి ఉంటుంది. చైనా షెన్‌జౌ -12 అంతరిక్ష నౌక ఏప్రిల్ 29 న భూమికి  340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని టియాన్హె ప్రధాన విభాగంతో డాక్ అవుతుంది. మాడ్యుల్‌ లో ప్రతి దానికి ప్రత్యేక లివింగ్‌ స్పేస్‌, వ్యాయామం కోసం ట్రెడ్‌ మిల్, గ్రౌండ్ కంట్రోల్‌ తో ఈమెయిల్‌, వీడియో కాల్‌ ల కోసం కమ్యూనికేషన్ సెంటర్‌ సదుపాయం ఉంది. మిషన్ కోసం తయారు కావడానికి, సిబ్బంది 6,000 గంటలకు పైగా శిక్షణ పొందారు. చైనా అంతరిక్ష సంస్థ వచ్చే ఏడాది చివరి వరకు మొత్తం 11 ప్రయోగాలను ప్లాన్ చేస్తోంది, వీటిలో మరో మూడు మిషన్లలో మనుషులను తీసుకెళ్లనున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో చైనా సామర్థ్యం, విశ్వాసం పెరుగుతోందనడానికి తాజా మిషన్ మరో నిదర్శనంగా నిలిచింది.
Tags:    

Similar News