చైనాలో కుక్కల పండుగ.. నిర్లక్ష్యానికి 4 వేల మూగజీవాలు బలి

Update: 2020-10-03 23:30 GMT
ఓ వైపు కరోనాదెబ్బకు ప్రపంచం మొత్తం విలవిలాడుతుంటే.. కరోనాకు పుట్టిళ్లు అయిన చైనాలో మాత్రం పండుగలు,  ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ దేశంలో ‘కుక్కమాంసం వేడుకలు’ ఘనంగా నిర్వహించారు. ఈ పండుగకోసం కుక్కలను, పిల్లలను తినడం ఆ దేశంలో ఆనవాయితీ.  అయితే కొంతమంది చేసిన పొరపాటు వల్ల సుమారు 4 వేల కుక్కలు, పిల్లులు తిండి, నీరులేక చనిపోయినట్టు సమాచారం. తిండి నీరు లేక మూగజీవాలు చనిపోవడంపై జంతుకారుణ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ చైనాకు చీమ కుట్టినట్టైనా లేదు. ఇటీవల ‘కుక్కలపండుగ’ కోసం ప్రజలు విపరీతంగా ఆన్​లైన్​లో పెంపుడు జంతువులను ఆర్డర్​ చేశారు. కానీ ఆన్​లైన్​ సంస్థల నిర్వాకం వల్ల గాలి, ఆహారం అందక సుమారు 4 వేల కుక్కలు బలైనట్టు సమా చారం. తిండీ తిప్పలు లేక అలమటించి మరీ అవి కన్నుమూశాయి. చనిపోయిన 4 వేల జంతువుల్లో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఇతర జంతువులు ఉన్నాయి.

జనం ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ ఇవ్వడంతో.. నిర్వాహకులు మూగజీవాలను ప్లాస్టిక్, కార్డుబోర్డు పెట్టెల్లో కుక్కి.. జంతు పరిశ్రమ నుంచి షిప్పుల ద్వారా పార్సిల్ చేశారు. జంతువుల పార్సిల్స్ తో కూడిన షిప్పు.. హెనాన్ ప్రావిన్స్‌లోని లౌహె నగరంలో గల డాంగ్‌షింగ్ లాజిస్టిక్స్ స్టేషన్‌ కు చేరుకున్న తర్వాత వాటి తరలింపుపై అందరూ నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ మూగజీవాలు నరకయాతన అనుభవించి చనిపోయాయి.

లాజిస్టిక్ కేంద్రంలో చిక్కుకుపోయాయనే సమాచారం అందుకున్న వెంటనే యుతోపియా యానిమల్ రెస్క్యూ అనే సంస్థ రంగంలోకి  దిగింది. ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ భయానక దృశ్యాలు కనిపించాయి. పెట్టేల్లో కుక్కి ఉంచిన జంతువులు మృత్యువాత పడి, తీవ్రమైన దుర్వాసన వ్యాపించిందని, తాము అక్కడికి చేరుకునే సమయానికే 4 వేల జంతువులు చనిపోగా, మరో వెయ్యి కుందేళ్లు, ఎలుకలు, కుక్కలు, పిల్లుల్ని కాపాడి, వెటర్నరీ ఆస్పత్రికి తరలించామని యానిమల్ రెస్క్యూ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

చైనా ప్రభుత్వ నిర్లక్ష్య దోరణితో మూగజీవాలు తరుచూ నరకయాతన అనుభవిస్తున్నాయని యుతోపియా జంతుకారుణ్య సంస్థ వ్యవస్థాపకురాలు హువా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టైంలో వాటి తరలింపు మరింత దారుణంగా ఉన్నదని ఆమె వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News