బంగ్లాదేశ్ కు భారత్ బాసట.. షాక్ లో చైనా

Update: 2020-07-27 06:00 GMT
సరిహద్దు దేశాలతో భొరత్ ఎప్పుడు సుహృద్భావ ధోరణి వ్యవహరిస్తోంది. కానీ పొరుగు దేశాలే తమ స్వార్థ ప్రయోజనాల కోసం కవ్వింపు.. రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ విధంగా చైనా.. పాకిస్థాన్ లు ఎప్పుడు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని వారాలుగా చైనా అదే ధోరణి అవలంభిస్తుండడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చైనాకు వినూత్న రీతిలో భారత్ షాకిచ్చింది. భారత నిర్ణయంతో ఆ దేశానికి షాక్ తగిలింది.

చుట్టూ భారత భూభాగంతో ఉండే దేశం బంగ్లాదేశ్. ఒకప్పుడు ఆ భూభాగం కూడా భారత్ దే. ఆ దేశం ఎప్పుడు భారత మిత్రపక్షం. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. తాజాగా ఆ సంబంధాల్లో భాగంగా భారతదేశం బంగ్లాదేశ్ కు భారీ సహాయం చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా బంగ్లాదేశ్  కు 10 అత్యాధునిక బ్రాడ్ గేజ్ లోకోమోటివ్  రైళ్లను భారత్ అందజేస్తోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య కనెక్టివిటీ పెంచేందుకు ఈ రైళ్లు దోహదం చేస్తాయి.  

బంగ్లాదేశ్.. భారత్ మధ్య 2019లో రైళ్ల విషయంపై సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ కనెక్టివిటీ నిర్మాణం కోసం మొత్తం 2.44 మిలియన్ డాలర్ల నిధులు అవసరం కాగా ఆ నిధులను భారత్ భరిస్తోంది. అయితే ఈ నిధులను బంగ్లాదేశ్ పదేళ్లలో భారత్ కు చెల్లించాలని ఒప్పందంలో ఉంది.  అదనంగా ఐదేళ్లపాటు ఈ నిధులపై మారటోరియం కూడా విధించినట్టు సమాచారం. ఈ విధంగా పొరుగు దేశంతో భారత్ సఖ్యతగా ఉండడం చైనాకు కంటగింపుగా ఉంది.
Tags:    

Similar News