మగాళ్లను రేప్ చేస్తే ఆ దేశంలో కఠినశిక్షే
ఇదెక్కడి చిత్రమండి బాబు.. మగాళ్లు మృగాళ్లగా మారి.. అమాయక ఆడపిల్లల మీద అత్యాచారం చేయటం.. వారికి జీవితాల్ని నాశనం చేయటం తెలుసు కానీ.. మగాళ్లు కూడా అత్యాచారాలకు గురి అవుతారా? అన్న షాక్ అక్కర్లేదు. ఎందుకంటే.. పలు దేశాల్లో తాము అత్యాచారానికి గురైనట్లుగా మగాళ్లు కేసులు పెట్టి.. నిరూపించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా చైనాలో ఒక మగాడికి అత్యాచార అనుభవం ఎదురుకావటం.. అతగాడు కోర్టుకు ఎక్కడం.. చివరకు ఆ దేశంలో మగాళ్లు రేప్ గురైతే భారీ శిక్ష ఖాయమంటూ చట్టాన్ని చేయటం కూడా జరిగిపోయింది.
2010లో తనపై అత్యాచారం జరిగిందంటూ ఒక మగాడు చైనాలో ఫిర్యాదు చేశాడు. ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే వ్యక్తి.. మరో పురుషుడి చేతిలో అత్యాచారానికి గురయ్యాడు. తనపై అత్యాచారం జరిగిందంటూ సదరు వ్యక్తి వాపోతూ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు నమోదు అయ్యే వరకూ అత్యాచారం ఆడవాళ్లకు మాత్రమే తప్ప.. మగాళ్లకు ఉండదన్నట్లుగా ఉండేది. దీంతో.. సదరు మగాడి రేప్ విషయంలో ఏం చేయాలో తోచని.. గాయపర్చిన ఘటనగా తేల్చి కొద్దిపాటి శిక్ష వేశారు.
దీనికి చైనాలో వ్యతిరేకత వ్యక్తమైంది. కోర్టు తీర్పుపైనా విమర్శలు భారీగా వచ్చాయి. శీలం ఎవరికైనా ఒకటేనని.. మగాడు.. ఆడవాళ్లు అన్న తేడా లేదన్న వాదన ఊపందుకుంది. చివరకు.. న్యాయస్థానాలు సైతం తామిచ్చిన తీర్పును ఒకసారి సరి చూసుకునే పరిస్థితి. దీంతో.. ఇలాంటి ఘటనల విషయంలోనూ శిక్షలు తీవ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో మగాళ్లపై అత్యాచారాలు జరిపితే.. కఠిన శిక్షలు విధించాలంటూ చైనా చట్టాల్లో మార్పులు చేశారు. ఇప్పుడా దేశంలో ఆడోళ్ల మీదనే కాదు మగాళ్ల మీద అత్యాచారాలు జరిగినా.. వారికి కఠిన శిక్షలు విధించాలని తేల్చారు.